
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ బుధవారం తెలుగురాష్ట్రాల్లో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 58,452 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కర్నేలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తున్నామని ఐసెట్ కన్వీనర్ తెలిపారు.