తిరుపతి వైసీపీ ఎంపీ టికెట్.. షాకిచ్చిన జగన్!?

తిరుపతి వైసీపీ ఎంపీ టికెట్ పై సీఎం జగన్ అనూహ్యనిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.. చనిపోయిన వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. జగన్ తోపాటు పాదయాత్రలో కలిసి నడిచిన ఆ వ్యక్తికే వైసీపీ ఎంపీ టికెట్ దక్కనుందని ప్రచారం సాగుతోంది. Also Read: మద్యం షాపులను వదలని సీఎం జగన్! ఇప్పటికే టీడీపీ తిరుపతి ఎంపీ బరిలో పనబాక లక్ష్మీని ప్రకటించి దూకుడు పెంచగా.. తాజాగా […]

Written By: NARESH, Updated On : November 20, 2020 3:07 pm
Follow us on

తిరుపతి వైసీపీ ఎంపీ టికెట్ పై సీఎం జగన్ అనూహ్యనిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.. చనిపోయిన వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. జగన్ తోపాటు పాదయాత్రలో కలిసి నడిచిన ఆ వ్యక్తికే వైసీపీ ఎంపీ టికెట్ దక్కనుందని ప్రచారం సాగుతోంది.

Also Read: మద్యం షాపులను వదలని సీఎం జగన్!

ఇప్పటికే టీడీపీ తిరుపతి ఎంపీ బరిలో పనబాక లక్ష్మీని ప్రకటించి దూకుడు పెంచగా.. తాజాగా అధికార వైసీపీ కూడా అభ్యర్థి వేటలో పడింది. దీని కోసం సీఎం జగన్ తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, చిత్తూరు జిల్లా నేతలతో చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అయితే నేతలంతా సీఎం జగన్ కే పార్టీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను అప్పగించారని తెలిసింది. దీంతో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠంగా మారింది.

ప్రతిపక్షంలో ఉండగా జగన్ పాదయాత్రలో తనతో కలిసి నడిచిన ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి పేరు కూడా తిరుపతి ఎంపీ బరిలో వినిపిస్తోంది. అయితే ముందుగా దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పిలిచి వారి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లాలని జగన్ భావిస్తున్నట్టు తెలిసింది.

Also Read: వైసీపీ సైలెంట్‌గా ఎందుకు సైడ్‌ అయినట్లు..?

ప్రస్తుతం వైసీపీ అధిష్టానం పరిశీలనలో చనిపోయిన ఎంపీ దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తి ఉన్నారు. కల్యాణ్ కు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇచ్చేలా ప్రస్తావన తేవాలని వైసీపీ అధిష్టానం యోచిస్తోందట.. వచ్చే మార్చిలో ఎమ్మెల్సీ పదవులు ఖాళీలు కానుండడంతో ఆ సీటు ఇచ్చేలా ప్రతిపాదన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై వైసీపీ వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

కళ్యాణ్ ను దింపాలా? లేదంటే మరో సీనియర్ గురుమూర్తికి సీటు ఇవ్వాలా అన్నది జగన్ తేల్చనున్నారు. వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా కలిసి పనిచేస్తామని.. భారీ మెజార్టీతో గెలిపిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ కు హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్