
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రమణ దీక్షితులు, తిరుమల తిరుపతి సలహాదారులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీసుబ్బారెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఆలయంలో ఒక గోవును కచ్చితంగా పూజించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుంచి గోవులను తీసుకువచ్చి అమ్మవారికి ఇచ్చామని తెలిపారు.