Telugu News » Ap » Flood warning notices for chandrababus house
కృష్ణ నది తీర ప్రాంతాలకు వరద హెచ్చరిక
ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఉధృతి తీవ్రమవుతోంది. దీంతో కృష్ణాజిల్లాలోని తూర్పు, పశ్చిమ కాలువలకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి వెంటపాలెం కరకట్ట లోపల వైపు ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటితో పాటు 36 భవనాలకు అధికారులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుతం 16.2 అడుగులకు నీటిమట్టం చేరుకోగా ఇన్‌ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.61 […]
ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఉధృతి తీవ్రమవుతోంది. దీంతో కృష్ణాజిల్లాలోని తూర్పు, పశ్చిమ కాలువలకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి వెంటపాలెం కరకట్ట లోపల వైపు ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటితో పాటు 36 భవనాలకు అధికారులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుతం 16.2 అడుగులకు నీటిమట్టం చేరుకోగా ఇన్‌ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులు ఉంది. కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.