
ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 37,381 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసులు సంఖ్య 8,81,273కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,098కి చేరింది. ఒక్కరోజులో 410 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,423 యాక్టివ్ కేసులున్నాయి.