Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్డాక్టర్‌ సుధాకర్‌ కేసు: హైకోర్టు అసంతృప్తి

డాక్టర్‌ సుధాకర్‌ కేసు: హైకోర్టు అసంతృప్తి

విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన మత్తు వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసుల వైఖరిపై సీబీఐ దాఖలు చేసిన నివేదికపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు పర్యవేక్షణాధికారిగా అడిషనల్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు నివేదిక అందించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్‌ మొదటి వారానికి వాయిదా వేసింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version