కార్తీక మాసం సందర్భంగా తిరుమలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు కార్తీక పర్వదీపోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. అయితే సాయంకాల కైంకర్యాలు, నివేదలను పూర్తయిన తరువాత దీపోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. అనంతరం వరుసగా గర్భాలయంలో అఖండం నుంచి స్వామి వారి పుష్కరిణి వరకు దీపాలను ఏర్పాటు చేయనున్నారు.