
ఇటీవల తిరుమలలో సీఎం జగన్‌తో కలిసి పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తిరుమల నుంచి ఇంటికి వెళ్లిన ఆయన ఆ తరువాత కొంత అస్వస్థకు గురయ్యారు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోవడంతో కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో మంత్రి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. బ్రహ్మూెత్సవాల కోసం తిరుమలకు వెళ్లిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడే వారం రోజుల పాటు ఉన్నాడు. ఇటీవల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఆయన సీఎంతోనే ఉన్నారు. అయితే మంత్రికి కరోనా పాజిటివ్ నిర్దారణ తెలియగానే అధికారులతో పాటు ఆలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.