విజయవాడ కనకదుర్గ ఆలయ సమీపంలోని ఫ్లై ఓవర్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే సోమవారం ఈ ఫ్లై ఓవర్ అశోక ఫిల్లర్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై ఫ్లై ఓవర్ పెచ్చులూడి పడ్డాయి. దీంతో ఏపీఎస్పీ మూడో బెటాలియన్ (పీసీ 2928)కి చెందిన రాంబాబుకు గాయాలయ్యాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో బందోబస్తు కోసం ఫ్లై ఓవర్ కింద రాంబాబు విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో ఆయనపై పెచ్చులు ఊడిపడడంతో చేతికి, భుజానికి గాయాలు అయ్యాయి. ఫ్లై ఓవర్ ప్రారంభించిన రెండు రోజులకే ఇలాంటి సంఘటన జరగడంతో ప్రజల్లో భయాందోళను నెలకొన్నాయి.