https://oktelugu.com/

ఏలూరు ఘటనపై సీఎం సమీక్ష

ఏలూరులో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. బాధితులకు చేస్తున్న వైద్య పరీక్షలపై అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు సీఎంకు వివరించారు. మరిన్ని కేంద్ర సంస్థలు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైద్యులు సీఎంకు తెలిపారు. బాధితులకు నిర్వహించిన పరీక్షలు, అలాగే ఆ ప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షలు వీటన్నింటి ఫలితాలను ఓ నివేదిక రూపంలో పొందుపరిచి తనకు ఇవ్వాలని […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 8, 2020 / 03:26 PM IST
    Follow us on

    ఏలూరులో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. బాధితులకు చేస్తున్న వైద్య పరీక్షలపై అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు సీఎంకు వివరించారు. మరిన్ని కేంద్ర సంస్థలు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైద్యులు సీఎంకు తెలిపారు. బాధితులకు నిర్వహించిన పరీక్షలు, అలాగే ఆ ప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షలు వీటన్నింటి ఫలితాలను ఓ నివేదిక రూపంలో పొందుపరిచి తనకు ఇవ్వాలని దీనిపై వీడియో కాన్ఫరెన్ష్ కూడా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు వివరించారు.