https://oktelugu.com/

వ్యవసాయ బిల్లులతో రైతులకు లాభామా.. నష్టమా?

లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన  వ్యవసాయం బిల్లులు దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపుతున్నాయో అందరికీ తెలిసిందే. . అయితే ఈ బిల్లుల్లో ఏముంది? రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? తెలుసుకుందాం.. కేంద్రం అమోదింపచేసుకున్న నిత్యావసర వస్తువులను నిలువ చేసుకునే బిల్లు, కంపెనీలు రైతులకు మధ్య ఒప్పందం, పంట దిగుబడులను ఎక్కడైనా అమ్ముకునే బిల్లుతో ఒక ప్రమాదం కూడా ఉంది. కార్పొరేట్ కంపెనీలు నేరుగా రైతులతో కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాలు చేసుకునే ఈ బిల్లులతో రైతులకు, వినియోగదారులకు ఎన్నో నష్టాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2020 / 03:07 PM IST
    Follow us on

    లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన  వ్యవసాయం బిల్లులు దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపుతున్నాయో అందరికీ తెలిసిందే. . అయితే ఈ బిల్లుల్లో ఏముంది? రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? తెలుసుకుందాం.. కేంద్రం అమోదింపచేసుకున్న నిత్యావసర వస్తువులను నిలువ చేసుకునే బిల్లు, కంపెనీలు రైతులకు మధ్య ఒప్పందం, పంట దిగుబడులను ఎక్కడైనా అమ్ముకునే బిల్లుతో ఒక ప్రమాదం కూడా ఉంది. కార్పొరేట్ కంపెనీలు నేరుగా రైతులతో కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాలు చేసుకునే ఈ బిల్లులతో రైతులకు, వినియోగదారులకు ఎన్నో నష్టాలు ఎదురుకానున్నాయి.

    Also Read: భారత్ బంద్ విజయవంతం.. అనుహ్యంగా రాత్రి 7గంటలకు చర్చలు..!

    మొదటి బిల్లులో నిత్యావసర వస్తువులు ఎంత మొత్తంలోనైనా నిలువ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కార్పొరేట్ శక్తులు కృత్రిమ కొరతను సృష్టించి వినియోగదారుల నడ్డివిరిచేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.

    కార్పొరేట్ కంపెనీలతో కలిసి రైతుల కాంట్రాక్టు వ్యవసాయం అనేది మరో పెద్ద కుట్ర. సామాన్య రైతుల వెంట నిలిచే మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేస్తూ రైతులను, కంపెనీలను నేరుగా అనుసంధానం చేయడమే కాకుండా, ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కార మార్గాలను మరింత జటిలం చేస్తుంది ఈ బిల్లు. ఇప్పటిదాకా మండల, డివిజన్ స్థాయిలో ఉన్న వివాద పరిష్కార మార్గాలే పూర్తిగా రైతులకు న్యాయం చేయలేకపోతున్నాయి. అలాంటిది జిల్లా అదనపు కలెక్టర్ స్థాయిలో పరిష్కారాలు చేసుకోవాలనడం రైతుల గొంతు నొక్కడమే. ఓ సామాన్య రైతు బడా కార్పొరేట్ సంస్థలతో న్యాయపోరాటం చేయగలడా? మరి ప్రభుత్వం గానీ, దాని అనుబంధ సంస్థలు గానీ రైతుకు అండగా లేకుండా చేయడం కార్పొరేట్ శక్తులకు ఊతమివ్వడం కాదా? పంట దిగుబడులను మార్కెట్లలోనే అమ్ముకోవాల్సిన అవసరం లేదనడమంటే మార్కెట్ వ్యవస్థను రూపుమాపడమే.

    ఇంతకుముందు మార్కెట్ లో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పితే కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసి, నిత్యావసర వస్తువుల చట్టం ప్రయోగించి ధరల స్థిరీకరణకు తోడ్పడేది. కానీ కొత్త బిల్లు ప్రకారం రైతులు, వినియోగదారులను కార్పొరేట్ల ఇష్టారాజ్యానికి వదిలేసి కేంద్రం తన కనీస బాధ్యతల నుంచి తప్పుకుంటుంది.

    వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది. మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వేయడానికి, ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.

    కాంట్రాక్ట్ ఫార్మింగ్: ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించయినా పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందీ చట్టం. ఈ ఒప్పందాలు కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకు చేసుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల ధర: ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొనాలి. ధర నిర్ణయ ప్రక్రియను ఒప్పందంలో రాయాలి.

    మూడంచెల వివాద పరిష్కార విధానం: ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ సయోధ్య(కన్సిలియేషన్) బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పీలేట్ అథారిటీ ఉంటుంది.

    Also Read: భారత్ బంద్.. ఢిల్లీ సీఎంను గృహనిర్భంధం చేసిన పోలీసులు..!

    ఏదైనా వివాదం తలెత్తితే మొదట బోర్డు పరిధిలో సయోధ్యకు ప్రయత్నిస్తారు. అక్కడ పరిష్కారం కాకుంటే 30 రోజుల తరువాత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సంప్రదించొచ్చు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలేట్ అథారిటీని సంప్రదించొచ్చు. అప్పీలేట్ అథారిటీగా ఐఏఎస్‌ స్థాయి అధికారులు ఉంటారు. ఏ స్థాయిలోనైనా రైతుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే రికవరీ కోసం వ్యవసాయ భూమిని తీసుకోవడానికి ఈ చట్టం అంగీకరించదు. అయితే, ఈ మూడు చట్టాలు రైతుకు మేలు చేసేలా కనిపించినా ఏమాత్రం ప్రయోజనకరం కావని.. వర్తకులు, బహుళ జాతి కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునేలా చేస్తాయని విపక్షలు, రైతుల ప్రయోజనాల కోసం పోరాడే సంస్థలు వాదిస్తున్నాయి. సన్నకారు రైతులను కష్టాల్లోకి నెడతాయని, ఈ చట్టాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని కూడా అంటున్నారు. అదే సమయంలో.. ఇదంతా రాజకీయ వ్యతిరేకతే కానీ రైతుల నుంచి వ్యతిరేకత లేదన్న అభిప్రాయమూ బలంగా వినిపిస్తోంది.

    * రైతు సంఘాల అభ్యంతరాలు
    ఈ బిల్లులతో వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలు చేపట్టినట్లవుతుందని బీజేపీ చెబుతుండగా విపక్షాలు సహా ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా ఆ వాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లులు ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే చిన్న, సన్నకారు రైతులు చితికిపోతారని పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, తృణ‌మూల్ కాంగ్రెస్, డీఎంకె, బీఎస్పీ స‌హా కొన్ని పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    * బియ్యం, గోధుమలే కాదు.. అన్ని పంటలకూ ప్రాధాన్యం దక్కాలి
    ”బియ్యం, గోధుమలను ప్రభుత్వం పెద్ద ఎత్తున సేకరిస్తోంది. కానీ, ఈ రెండూ దేశంలో అవసరానికి మించి ఉన్నాయి.ఏటా 8 కోట్ల టన్నుల ధాన్యం ప్రభుత్వం దగ్గర మూలుగుతోంది. పప్పులు, వంట నూనెల కొత మన దేశంలో ఉంది. వీటిని ప్రపంచంలో అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది భారతే. ఇలాంటి పరిస్థితి పోయి పంటల విషయంలో సమతుల్యతకు ఈ చట్టాలు అవకాశమిస్తాయి.