ఎట్టకేలకు దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది. కానీ.. ఫలితాలపై మాత్రం అన్ని పార్టీల్లోనూ టెన్షన్ మొదలైంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ ఉండడంతో ఏ పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుందా అని ఆసక్తికరంగా మారింది. నిన్నటి ఎన్నికల సరళిని పరిశీలిస్తే 2017లో ఏపీలో జరిగిన ఉప ఎన్నికలను తలపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అప్పటి ఉప పోరుకు.. దీనికి పోలిక పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
2017లో ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. వాస్తవానికి ఆయన 2014లో వైసీపీ తరపున గెలిచి.. తర్వాత అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఈ సీటు తమదంటే..తమదని.. టీడీపీ, వైసీపీలు పోరాడాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ పోరులో బరిలో నిలిచింది. పోరు హోరాహోరీని తలపించింది.
ఇప్పుడు దుబ్బాకలో ఎలా అయితే.. ఒక మంత్రి తిష్టవేసి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారో.. అప్పట్లో కాల్వ శ్రీనివాసులు సహా ఇద్దరు ముగ్గురు మంత్రులకు చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పారు. అదేవిధంగా దుబ్బాకలో రాత్రికి రాత్రి ప్రధాన డ్రైన్లు, రోడ్లు ఎలా పూర్తయ్యాయో.. అప్పట్లో నంద్యాల కర్నూలు.. ప్రధాన రహదారి విస్తరణ.. కాల్వలకు రిపేర్లు చేశారు.
Also Read: దుబ్బాక ఫలితం.. గ్రేటర్‌పై ప్రభావం
టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత, నాటి సీఎం చంద్రబాబు నేరుగా అక్కడికి ప్రచారానికి వెళ్లలేదు. కానీ.. ఆయన కనుసన్నల్లోనే ప్రచారం సాగింది. దుబ్బాకలోనూ ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రచారానికి రాలేదు. కానీ.. మినట్ టు మినట్ అక్కడ ఏం జరుగుతోందో మానిటరింగ్ చేశారు. పోలీసుల దూకుడు కూడా అప్పట్లో నంద్యాలలో కొనసాగింది. ఇప్పుడు దుబ్బాకలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది.
ఇక పోలింగ్ విషయానికి వస్తే దుబ్బాకలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు తర్వాత కూడా ప్రజలు ఓపికతో క్యూల్లో ఉన్నారు. నంద్యాలలో మాత్రం పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తినా అలజడులు, ఘర్షణలు, లాఠీచార్జీలకు దారితీసింది. ఇక పోలింగ్ శాతాలకు వస్తే నాడు నంద్యాలలో 87 శాతం రికార్డు స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు దుబ్బాకలో సాయంత్రం ఆరు గంటలకే 75 శాతం పోలింగ్ పూర్తయింది. తుది ఫలితం వచ్చేసరికి 82.61 శాతం పోలింగ్ నమోదైంది.
Also Read: స్థానిక ఎన్నికలకు వైసీపీ నై.. టీడీపీ సై..కారణమేంటి?
ఇక.. ఫలితం విషయానికి వస్తే ఇంత భారీ రేంజ్‌లో పోలింగ్ జరిగింది కాబట్టి.. అధికార పార్టీకి వ్యతిరేకమని ప్రతిపక్షం, ప్రభుత్వ పథకాలకు ఫిదా అయ్యారని అధికార పక్షం నంద్యాల విషయంలో ప్రచారం చేసుకున్నాయి. చివరికి అధికార పక్షానిదే విజయం అయింది. దుబ్బాక విషయంలో మాత్రం పైవిధంగానే విశ్లేషణలు వస్తున్నా.. ఫలితం మాత్రం ఉత్కంఠకు గురి చేస్తోంది. ఈ నెల 10న ఫలితం వెలువడే వరకు బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య ఈ ఉత్కంఠ తప్పదేమో.