ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్న పోలీసులు అతడని అదుపులోకి తీసుకున్నారు. పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ ఇటీవల మరణించారు. ఆమె దశదిన కర్మలను నిర్వహించేందుకు ఆయన స్వస్థలమైన మచిలిపట్నంలో ఉన్నారు. అయితే ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి మంత్రి కాళ్లకు దండం పెడుతున్నట్లుగా వంగి ఒకేసారి తాపీతో దాడికి యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న మంత్రి అనుచరలు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి మచిలీపట్నంకు చెందిన బడుగు నాగేశ్వర్ రావుగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Attempt to attack ap minister perni nani
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com