ఈసారి కోర్టుకు ఏపీ ఎస్ఈసీ..

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. బుధవారం కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ ను కలిసి పరిస్థితిని వివరించారు. రాజ్యాంగ ప్రకారం నిర్వహించాల్సిన ఎన్నికలను కొందరు తమ సొంత ప్రయోజనాలకు జరగనివ్వడం లేదని చెప్పారు. అయితే మరోసారి గురువారం కలెక్టర్ల సమావేశం కోసం […]

Written By: Suresh, Updated On : November 19, 2020 12:18 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. బుధవారం కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ ను కలిసి పరిస్థితిని వివరించారు. రాజ్యాంగ ప్రకారం నిర్వహించాల్సిన ఎన్నికలను కొందరు తమ సొంత ప్రయోజనాలకు జరగనివ్వడం లేదని చెప్పారు. అయితే మరోసారి గురువారం కలెక్టర్ల సమావేశం కోసం సీఎస్ కు లేఖ రాశారు.  ఈరోజు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.   మరోసారి సమావేశానికి అనుమతి రాలేదు. దీంతో ఎన్నికల కమిషనర్ కోర్టకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.