ఫస్ట్‌ లిస్టులో ప్రముఖులకు షాకిచ్చిన కేసీఆర్!

దుబ్బాక గుణపాఠంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఫాస్ట్‌గా దూసుకెళ్లింది టీఆర్‌‌ఎస్‌. అంతే ఫాస్ట్‌గా నిన్న గ్రేటర్‌‌ అభ్యర్థులనూ ప్రకటించింది. 105 స్థానాలకు గాను క్యాండిడేట్ల లిస్టును వెల్లడించింది. అయితే.. ఇందులో ప్రముఖుల కుటుంబ సభ్యులు పోటీచేసే స్థానాలను పెండింగ్‌లో పెట్టి షాకిచ్చింది. ఎమ్మెల్యే సతీమణులు.. సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్న వారికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. అయితే.. తొలి జాబితాలోనే స్థానం దొరకని వారికి.. మలి జాబితాలో చోటెలా లభిస్తుందా అని కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. Also Read: […]

Written By: NARESH, Updated On : November 19, 2020 12:52 pm
Follow us on

దుబ్బాక గుణపాఠంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఫాస్ట్‌గా దూసుకెళ్లింది టీఆర్‌‌ఎస్‌. అంతే ఫాస్ట్‌గా నిన్న గ్రేటర్‌‌ అభ్యర్థులనూ ప్రకటించింది. 105 స్థానాలకు గాను క్యాండిడేట్ల లిస్టును వెల్లడించింది. అయితే.. ఇందులో ప్రముఖుల కుటుంబ సభ్యులు పోటీచేసే స్థానాలను పెండింగ్‌లో పెట్టి షాకిచ్చింది. ఎమ్మెల్యే సతీమణులు.. సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్న వారికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. అయితే.. తొలి జాబితాలోనే స్థానం దొరకని వారికి.. మలి జాబితాలో చోటెలా లభిస్తుందా అని కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.

Also Read: కేసీఆర్‌‌కు బీజేపీ రివర్స్‌ పంచ్‌!

అంతేకాదు.. టీఆర్‌‌ఎస్‌ నిన్న ప్రకటించిన జాబితాలో మేయర్ బొంతురామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చర్లపల్లి డివిజన్ క్యాండిడేట్‌ను కూడా ప్రకటించలేదు. ఈసారి ఈ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో ఆయనకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే.. ఆ స్థానంలో బొంతు సతీమణి పద్మకు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆశ్చర్యకరంగా తొలి జాబితాలో చర్లపల్లి డివిజన్ ను చేర్చలేదు. దీంతో.. మేయర్ సతీమణికి టికెట్ లభిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

అంబర్‌‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్.. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాషణ్ రెడ్డి సతీమణులు ఇద్దరూ కార్పొరేటర్లే. అయినప్పటికీ. తొలి జాబితాలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకు చోటు దక్కలేదు. అధికార పక్ష ఎమ్మెల్యేలుగా ఉండి కూడా తొలిజాబితాలో చోటు లభించకపోవటంపై వారు ఆందోళన చెందుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పరిస్థితీ ఇలాంటిదే. ఆయన కుమార్తె లాస్య నందిత గత ఎన్నికల్లో కార్పొరేటర్ గా విజయం సాధించారు. అయినప్పటికీ.. ఆమె పేరును తొలి జాబితాలో ప్రకటించలేదు. ఇలా ప్రముఖుల కుటుంబ సభ్యుల పేర్లను పెండింగ్‌లో పెట్టడం వారికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు.

Also Read: బండి సంజయ్‌ అక్కడే తప్పులో కాలేశాడా?

ఇదిలా ఉంటే.. మంత్రి తలసాని కోడలు కూడా ఈసారి గ్రేటర్ బరిలో దిగుతారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ.. గ్రేటర్ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయటం లేదని మంత్రి స్వయంగా వెల్లడించడం ఆసక్తిగా మారింది. మరోవైపు బేగంపేట సిట్టింగ్ కార్పొరేటర్ ఉప్పల తరుణి పేరును ఫైనల్ చేయలేదు. పెండింగ్‌లో ఉన్న 45 డివిజన్లలో బేగంపేట ఒకటి కావటంతో.. మంత్రి తలసాని కోడలుకు అవకాశం దక్కుతుందా? లేదా అనేది చర్చగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్