కరోనా వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపని ఇండియన్స్‌

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇన్నాళ్లు ప్రజలు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్‌ను కనిపెట్టారు. మరో వారం రోజుల్లో దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. అయితే.. వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు..? అనే దాని మీద ఆసక్తి నెలకొంది. ఈ వ్యాక్సిన్లపై ప్రజల్లో ఎంతవరకు నమ్మకం ఉందనేది తెలియకుండా ఉంది. అయితే.. మెజార్టీ భారతీయుల్లో వ్యాక్సిన్‌పై అనాసక్తే ఉందట. Also […]

Written By: Srinivas, Updated On : January 6, 2021 3:14 pm
Follow us on


ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇన్నాళ్లు ప్రజలు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్‌ను కనిపెట్టారు. మరో వారం రోజుల్లో దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. అయితే.. వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు..? అనే దాని మీద ఆసక్తి నెలకొంది. ఈ వ్యాక్సిన్లపై ప్రజల్లో ఎంతవరకు నమ్మకం ఉందనేది తెలియకుండా ఉంది. అయితే.. మెజార్టీ భారతీయుల్లో వ్యాక్సిన్‌పై అనాసక్తే ఉందట.

Also Read: చంద్రబాబుకు ‘కరోనా’ భయం

ఓ సర్వే ప్రకారం కొన్ని వేల మంది అభిప్రాయాల‌ను తీసుకున్నారు. ఈ స‌ర్వేల్లో మెజారిటీ మంది క‌రోనా విరుగుడు వ్యాక్సిన్ ను వేయించుకోవ‌డానికి త‌మ‌కెలాంటి సంసిద్ధత లేద‌ని స్పష్టం చేశార‌ట‌. ఈ అంశం గురించి అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ మాసాల నుంచే స‌ర్వేలు జరుగుతున్నాయి. వాటి ప్రకారం.. అక్టోబ‌ర్ లో దాదాపు 59 శాతం మంది వ్యాక్సిన్ పై అనాస‌క్తిని వ్యక్తం చేశార‌ట‌. ప్రస్తుత ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ వ‌చ్చేస్తే వేయించుకుంటారా? అనే ప్రశ్నకు ‘నో’ అని స‌మాధానం ఇచ్చార‌ట.

అటు నవంబర్‌‌లోనూ దాదాపు అలాంటి అభిప్రాయాలే వెల్లడయ్యాయట. డిసెంబ‌ర్ ప‌రిణామాల ఆధారంగా అభిప్రాయాల‌ను తీసుకుంటే.. దాదాపు 69 శాతం మంది క‌రోనా వ్యాక్సిన్ ను వేయించుకోవ‌డానికి తాము రెడీగా లేమ‌ని స్పష్టం చేశార‌ట‌. 26 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకుంటామని చెప్పారట. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో వస్తున్న సైడ్‌ ఎఫెక్ట్‌లతోనే ప్రజలు వెనుకాడుతున్నారనేది స్పష్టమవుతోంది. వ్యాక్సిన్ అంటే అలా త‌యారు చేసి, ఇలా ఇంజెక్ట్ చేసేది కాద‌ని క్లారిటీ వ‌చ్చింది.

Also Read: ఆ నూనెలకు గంగూలీ గుండెపోటు సెగ

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజురోజుకూ దాని ప్రభావం కూడా తగ్గుతోంది. దీంతో ప్రజలు కూడా తమతమ పనుల్లో బిజీ అయిపోయారు. గ్రామీణ‌, ప‌ట్టణ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు క‌రోనా గురించి ప‌ట్టించుకునే వారే లేరు. మాస్కులు కూడా తీసేసి తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ వచ్చింది. కానీ.. అదే సమయంలో కొందరిలో సైడ్‌ ఎఫెక్ట్‌ వస్తుండడంతో వ్యాక్సినేషన్‌కు అంతగా ఆసక్తి చూపడం లేదనేది వాస్తవం.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్