ఏపీ కరోనా అప్డేట్

ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నది. గతంలో రోజువారీ కేసులు పదివేలుగా ఉండేవి. ఇప్పుడు రోజుకు 500 లోపే కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు అత్యంత తక్కువగా నమోదవుతుండటంతో సాధారణ జీవనానికి ప్రజలు క్రమంగా అలవాటుపడుతున్నారు. అయితే, చలికాలం, సెకండ్ వేవ్, కొత్త వైరస్ పొంచి ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇక ఇదిలా ఉంటె, ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో […]

Written By: Suresh, Updated On : December 23, 2020 6:15 pm
Follow us on

ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నది. గతంలో రోజువారీ కేసులు పదివేలుగా ఉండేవి. ఇప్పుడు రోజుకు 500 లోపే కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు అత్యంత తక్కువగా నమోదవుతుండటంతో సాధారణ జీవనానికి ప్రజలు క్రమంగా అలవాటుపడుతున్నారు. అయితే, చలికాలం, సెకండ్ వేవ్, కొత్త వైరస్ పొంచి ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇక ఇదిలా ఉంటె, ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. ఏపీలో మొత్తం ఇప్పటి వరకు 8,79,718 కేసులు నమోదు కాగా, ఇందులో 8,68,769 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 3,864 కేసులు రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 7085 మంది మృతి చెందినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.