
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తగ్గుముఖం పట్టాయి. అయినా పాఠశాలలు, కళాశాలల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 50 రోజుల పాటు ప్రచారం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నుంచి 50 రోజుల పాటు కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళాశాలలు, పాఠశాలల్లో కరోనా కేసులు అంచనా వేస్తూ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే విద్యాసంస్థల్లో కరోనా విజ్రుంభిస్తోంది.