
ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 64,236 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,78,723కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,076కి చేరింది.