
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ధనుర్మాసంతోపాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో పోటెత్తారు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కొండ కిందగల కల్యాణకట్ట, కొండపైన ప్రసాదాల విక్రయశాల, తిరు వీధులు భక్తులతో సందడిగా మారాయి. ఉదయం స్వామివారికి తలనీలాలు సమర్పించి, స్నాన మాచరించిన భక్తులు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.