తెలంగాణలో కలకలం: ఒకే ఇంట్లో 22 మందికి కరోనా

కరోనా రాష్ట్రంలోకి తొలినాళ్లలో తెలంగాణ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ నాడు కరోనా నివారించేందుకు శతవిధలా ప్రయత్నించారు. అయితే నాడు మర్కజ్ సంఘటన ప్రభుత్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టింది. Also Read: తెలంగాణ కరోనా సెకండ్ వేవ్.. మంత్రి ఈటల క్లారిటీ ఢిల్లీలోని మర్కజ్ కు వెళొచ్చిన వారితో తెలంగాణలో కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో నాడు ప్రభుత్వం అప్రమత్తమై వారి వివరాలను సేకరించేందుకు నానా ఇబ్బందులు పడాల్సింది. సూర్యాపేట జిల్లాలోనూ మర్కజ్ కు […]

Written By: Neelambaram, Updated On : January 1, 2021 7:49 pm
Follow us on

carona

కరోనా రాష్ట్రంలోకి తొలినాళ్లలో తెలంగాణ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ నాడు కరోనా నివారించేందుకు శతవిధలా ప్రయత్నించారు. అయితే నాడు మర్కజ్ సంఘటన ప్రభుత్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టింది.

Also Read: తెలంగాణ కరోనా సెకండ్ వేవ్.. మంత్రి ఈటల క్లారిటీ

ఢిల్లీలోని మర్కజ్ కు వెళొచ్చిన వారితో తెలంగాణలో కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో నాడు ప్రభుత్వం అప్రమత్తమై వారి వివరాలను సేకరించేందుకు నానా ఇబ్బందులు పడాల్సింది.

సూర్యాపేట జిల్లాలోనూ మర్కజ్ కు వెళ్లొచ్చిన వారితో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో నాడు ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఇలాంటి సంఘటనే జిల్లాలో మరోసారి వెలుగుచూడటంతో ప్రజలంతా ఆందోళన రేపుతోంది.

సూర్యపేట పట్టణంలోని యాద్రాది టౌన్ షిప్ లో నివాసం ఉంటున్న ఓ ఇంట్లో ఏకంగా 22 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే ఇంట్లో ఇటీవల ఓ వ్యక్తి మృతిచెందగా పెద్ద సంఖ్యలో బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

Also Read: ‘సాగర’ మథనం చేస్తున్న కేసీఆర్..!

మృతిచెందిన వ్యక్తి కుమారుడికి పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేశారు. దీంతో 22మందికి కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.

అంత్యక్రియలకు హాజరైన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ విషయంలో జిల్లాలో కలకలం రేపుతుండటంతో డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది యాదాద్రి టౌన్ షిప్ లోని ఇంటింటా కరోనా టెస్టులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్