https://oktelugu.com/

వరదలో కొట్టుకొపోయిన కారు.. మహిళ మృతి

బంగాళాఖాతం వాయుగుండం తీరం దాటి భూభాగంపైకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని విశాఖలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. నర్సీపట్నంలోని రెండురోజులగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాగాజా నర్సీపట్నం నుంచి తిరుపతికి కారులో వెళ్తున్న కుటుంబం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వెదుళ్లగడ్డ ప్రవాహంలో చిక్కుకుపోయింది. దీంతో స్థానికులు కారులో నుంచి ముగ్గురిని రక్షించారు. అయితే అప్పటికే ఓ మహిళ […]

Written By: , Updated On : October 13, 2020 / 03:18 PM IST
Follow us on

బంగాళాఖాతం వాయుగుండం తీరం దాటి భూభాగంపైకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని విశాఖలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. నర్సీపట్నంలోని రెండురోజులగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాగాజా నర్సీపట్నం నుంచి తిరుపతికి కారులో వెళ్తున్న కుటుంబం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వెదుళ్లగడ్డ ప్రవాహంలో చిక్కుకుపోయింది. దీంతో స్థానికులు కారులో నుంచి ముగ్గురిని రక్షించారు. అయితే అప్పటికే ఓ మహిళ మృతి చెందారు. సమాచారం తెలుసున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.