Homeఆంధ్రప్రదేశ్‌Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా ఉందని.. బోండా ఉమామహేశ్వరరావు కు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అటువంటిదేమీ లేదని బోండా అనుచరులు చెబుతున్నారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు ద్వారా కాపు రాజకీయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాపుల చుట్టూ రాజకీయం చేసి ఆ సామాజిక వర్గాన్ని కూటమి నుంచి దూరం చేయాలన్న ఆలోచనతో వైసిపి ఉంది. అందుకోసం ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పటికే వైసీపీ కాపు నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొందరైతే పొలిటికల్ అజెండా లేదని చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా కాపు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ వారి అంతిమ లక్ష్యం కాపులను కూటమి నుంచి దూరం చేయడమే. ఇప్పుడు వెతుకుతున్న అంశం వైసీపీ కాలికి తగిలినట్లు అయింది. అందుకే బోండా ఉమామహేశ్వరరావు చుట్టూ రాజకీయాలు నడుపుతోంది వైసిపి.

* వివరణ కోరిన పార్టీ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వేదిక పంచుకోవడంతో పాటు ముద్రగడ పద్మనాభంను నిర్లక్ష్యం చేయడం వల్లే 2019లో టిడిపి ఓడిపోయింది అంటూ మాట్లాడారు బోండా ఉమామహేశ్వరరావు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ హై కమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని.. చంద్రబాబు స్పందించి వివరణ కోరాలని నిమ్మల రామానాయుడు ను ఆదేశించారని.. రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస్ సోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ప్రచారం నడిచింది. అయితే అటువంటిదేమీ లేదు అని బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు చెబుతున్నారు. అయితే ఇదే అదునుగా బోండా ద్వారా రాజకీయం చేయాలని చూస్తోంది వైసిపి. ఇప్పుడు కాకపోయినా ఎన్నికలకు ముందైనా బోండా వైసీపీలో చేరడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం విస్తృతం చేస్తోంది. అనుకూల ఎనలిస్టులతో ఇదే అభిప్రాయం చెప్పిస్తోంది. తద్వారా బోండా చుట్టూ వివాదం రేకెత్తించి.. టిడిపి హై కమాండ్ ద్వారా ఆయన పై వేటు వేసే ప్లాన్ చేసింది. అయితే ఇదంతా పట్టించుకునే స్థితిలో లేరు బోండా ఉమామహేశ్వరరావు. టిడిపిని వీడిన మరుక్షణం ఆయన పరిస్థితి తెలియంది కాదు.

* టిడిపి కి వచ్చే నష్టం ఏంటి..
బోండా ఉమామహేశ్వరరావు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయనకు మించి బలమైన నాయకుడిగా వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు. ఆయనకు లైన్ క్లియర్ చేసినట్టు ఉంటుంది. వంగవీటి ఫ్యామిలీకి విజయవాడ నగరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాపుల్లో కూడా ఇప్పటికీ ఆరాధన భావం కనిపిస్తుంది వంగవీటి మోహన్ రంగ పై. అయితే ఒకవేళ వైసీపీ ప్రలోభాలకు లొంగి బోండా ఉమామహేశ్వరరావు ఆ పార్టీలో చేరితే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. దానివల్ల వైసిపికి వచ్చే ప్రయోజనం లేదు. పైగా వంగవీటి రాధాకృష్ణకు లైన్ క్లియర్ చేసినట్టు ఉంటుంది. ఆ కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చి కాపులను మరింత మద్దతుదారులుగా కూటమి మార్చుకునే పరిస్థితి ఉంటుంది. అయితే అంతటి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ హై కమాండ్ వస్తుందా? బోండా ఉమామహేశ్వరరావు టిడిపిని వదులుకోగలరా? అనేది కూడా ఒక ప్రశ్న. కేవలం మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో బోండా ఉమామహేశ్వరరావు అలా చేసి ఉంటే మాత్రం చూడాలి. లేకుంటే కాపుల అంశాన్ని బయటకు తీసుకొచ్చి పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలి అనుకుంటే ఆయనే ముందుగా మూల్యం చెల్లించుకుంటారు. టిడిపికి వచ్చే నష్టం ఏమీ లేదన్నది విశ్లేషకుల మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....
Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper