Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu : చంద్రబాబు హుందా.. వైసీపీ నేతలకు ఇప్పుడు అదే అస్త్రం!

CM Chandrababu : చంద్రబాబు హుందా.. వైసీపీ నేతలకు ఇప్పుడు అదే అస్త్రం!

CM Chandrababu :  వైసిపి నేతల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. సీఎం చంద్రబాబు మంచోడని చెబుతున్నారు. ఆయన చాలా హుందాగా ఉంటారని చెప్పుకొస్తున్నారు. కొందరైతే అంతర్గత సమావేశాల్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం బాహటంగానే చెప్పుకొస్తున్నారు. అయితే చంద్రబాబులో హుందాతనం వారికి ఇప్పుడే తెలిసిందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన ఇంటిపై దండయాత్ర చేశారు అప్పటి ఎమ్మెల్యే జోగి రమేష్. వందలాది వాహనాలతో కాన్వాయ్ గా వెళ్లి మరి.. చంద్రబాబు ఇంటి తలుపులను ధ్వంసం చేయడాన్ని ప్రయత్నించారు. కొడాలి నాని లాంటి వారు నోరు తెరిచి పది నిమిషాల పాటు మాట్లాడితే.. చంద్రబాబు తండ్రి పేరు నుంచి.. కుమారుడు లోకేష్ గురించి దారుణంగా మాట్లాడేవారు. వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడిన నేతలు వైసీపీలో అతి తక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే రాజశేఖరరెడ్డి తో రాజకీయం చేసిన ఏ వైసీపీ నేత హుందాతనం మరిచి మాట్లాడలేదు. జగన్ ద్వారా పదవులు పొందిన వారు, పొందాలనుకున్నవారు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.

* కేసుల భయంతోనే
అయితే చంద్రబాబులో హుందాతనం గురించి ఇప్పుడు కొత్తగా కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అయితే వారు కేసుల నుంచి బయట పడాలనో.. కూటమి ప్రభుత్వం నుంచి తమకు ఇబ్బందులు ఎదురు కాకూడదని అలా కొత్త పల్లవి అందుకున్నారు. మాజీమంత్రి పేర్ని నాని అయితే చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య ఉన్నారు. ఆమెను అరెస్టు చేయించాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నం చేశారని.. కానీ చంద్రబాబు ఆమె అరెస్ట్ కు ఒప్పుకోలేదని.. ఆడవారితో రాజకీయాలు ఏంటని ప్రశ్నించారని తాజాగా పెర్ని నాని మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. అయితే తెర వెనుక చాలామంది వైసీపీ నేతలు ఇదే మెసేజ్ పంపిస్తున్నారు. నిఘవర్గాల ద్వారా చంద్రబాబు గొప్పతనంపై మాట్లాడుతూ సమాచారం ఇస్తున్నారు. అయితే చంద్రబాబులో హుందాతనం ఇప్పుడు చూశారా? అన్నదే ప్రశ్న.

* చంద్రబాబు అరెస్టు సమయంలో..
గత ఏడాది చంద్రబాబు అరెస్టయ్యారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక నాయకుడు రిమాండ్ ఖైదీగా అన్ని రోజులపాటు ఉండిపోవడం అదే తొలిసారి. ఆ సమయంలో చంద్రబాబు వయసు వైసీపీ నేతలకు గుర్తుకు రాలేదు. ఆయన గొప్పతనం గుర్తుకు రాలేదు. ఆయన హుందాతనాన్ని కూడా వీరు గుర్తించలేదు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు అంతర్గత సమావేశాలతో పాటు బహిరంగంగానే చంద్రబాబు హుందాతనం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో టిడిపి శ్రేణులు సైతం గొప్పగా భావిస్తున్నాయి. అయితే వారంతా తాత్కాలిక ప్రయోజనాల కోసమే చంద్రబాబును పొగుడుతున్నారని గుర్తించలేకపోతున్నాయి. మొత్తానికైతే చంద్రబాబు హుందా భజనతో వైసీపీ నేతలు గడిపేస్తుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version