Nara Lokesh: ఒక వ్యక్తి సమర్థత నిరూపించుకునేందుకు ఆయన పనితీరు ఒక్కటే కొలమానం కాదు. ఆయన ప్రతికూల పరిస్థితులను దాటి రావడం కూడా ప్రజల్లో గుర్తింపును తెచ్చిపెడుతుంది. కష్టాలను అధిగమించే క్రమంలో ఆయన నైపుణ్యం బయటపడుతుంది. మంత్రి నారా లోకేష్ విషయంలో జరిగింది అదే. ప్రస్తుతం ఎక్కడ చూసినా నారా లోకేష్ మాట వినిపిస్తోంది. అంతలా ప్రభావం చూపుతున్నారు లోకేష్. జాతీయస్థాయిలో రాజకీయ ప్రత్యర్థుల సైతం అభినందించక మానడం లేదు. కానీ వైసీపీ మాత్రం అరచి గోల పెడుతూనే ఉంది. విచిత్రం ఏంటంటే ఇంతకుముందు లోకేష్ స్థానంలో అదే శాఖకు మంత్రిగా వ్యవహరించి గుడ్డు మంత్రిగా గుర్తింపు పొందిన గుడివాడ అమర్నాథ్ అరచి గోల పెడుతున్నారు. దీంతో ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు. వైసీపీలో ఎవరూ లేదన్నట్టు గుడివాడ అమర్నాథ్ చేత విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
* ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ..
రాజకీయాల్లో విమర్శలు అనేవి సహజం. కానీ లోకేష్ పై వచ్చినవి విమర్శలు కావు. అంతకుమించి ఆయనపై వ్యక్తిగత దాడి జరిగింది. అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంటూ తనను తాను రాటు దేల్చుకున్నారు నారా లోకేష్. యువ గళం పాదయాత్రతో తనను తాను ఆవిష్కరించుకున్నారు. ఏకంగా ఇప్పుడు ప్రధాని కలిసిన ప్రతిచోట అభినందనలు చెబుతున్నారంటే ఆయన నడవడిక, ప్రగతి ఇట్టే అర్థమవుతోంది. అయితే పెరటి కోళ్లు మాదిరిగా వైసీపీ నేతలు కొక్కొరకో అంటూ అరుస్తూనే ఉన్నారు. అయితే మరీ వింతగా కోడి గుడ్డు మంత్రి విమర్శలు చేయడం కొద్దిగా అతిగా ఉంది. ఇది ప్రజల్లోకి బలంగా వెలుతోంది.
* ప్రతి అంశాన్ని పూల పాన్పుగా
ఒక విధంగా చెప్పాలంటే నారా లోకేష్ ఆవిష్కరణ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగానో ఉపయోగపడింది. ఆ పార్టీ నేతలు పప్పు అనకపోతే తనను తాను ప్రూవ్ చేసుకునే ఆలోచన లోకేష్ కు వచ్చి ఉండేది కాదు. ఆయన శరీర ఆకృతి పై విమర్శలు చేయకపోయి ఉంటే.. ఆయన ఇంతలా స్లిమ్ గా తయారయ్యే వారు కాదు. ఆయన మాటలపై హేళనగా మాట్లాడక పోయి ఉంటే.. భాష పై పట్టు సాధించేవారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దాడిని.. ఒక పూల పాన్పుగా మార్చుకున్నారు. ఈరోజు దేశ ప్రధాని అభినందించేలా తనను మార్చుకున్నారు నారా లోకేష్. అయితే తమ వల్లే లోకేష్ ఈ స్థాయికి చేరుకున్నాడని వైసిపి తెలుసుకునే లోపు ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మున్ముందు లోకేష్ ఎదుగుదల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే.