Duvwada family dispute
MLC Duvvada : ఎట్టకేలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వైసిపి హై కమాండ్ దృష్టి పెట్టింది. గత పది రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ తమను పట్టించుకోవడంలేదని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపించారు. తొలుత ఇద్దరు కుమార్తెలు తండ్రిని వెతుక్కుంటూ ఆయన నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. అయితే వారికి లోపలికి ఎంట్రీ లేకుండా పోయింది. లోపల గేట్లకు తాళాలు వేశారు. లైట్లు ఆఫ్ చేశారు. అర్ధరాత్రి వరకు వేచి చూసిన ఇద్దరు కుమార్తెలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు దువ్వాడ వాణి రంగంలోకి దిగారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి దువ్వాడ నివాసానికి చేరుకున్నారు. గేట్లకు తాళాలను బలవంతంగా తొలగించి లోపలకు ప్రవేశించారు. దీనిపై దువ్వాడ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. భార్య పిల్లలపై దాడి చేసినంత పని చేశారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. గత పది రోజులుగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు మాధురి ఎంటర్ అయ్యారు. అప్పటినుంచి మీడియాకు ఈ ఘటన ప్రాధాన్యత అంశంగా మారిపోయింది. దువ్వాడ కుటుంబ సన్నిహితులు, సామాజిక వర్గ పెద్దలు రంగంలోకి దిగిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా వైసిపి హై కమాండ్ పట్టకుండా వ్యవహరించింది. అది దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారంగా భావించింది. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ వ్యవహరించిన తీరును అంత గుర్తు చేశారు. ఇది వ్యక్తిగతమైతే.. మరి పవన్ పై ఎందుకు విమర్శలు చేయవలసి వచ్చిందో చెప్పాలన్న డిమాండ్ వినిపించింది.
* తొలుత విజయసాయి బాగోతం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయసాయిరెడ్డి బాగోతం బయటపడింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త తెరపైకి వచ్చారు. తన భార్య కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. విజయసాయి రెడ్డి పై అనుమానం వ్యక్తం చేశారు. డీఎన్ఏ పరీక్ష చేయాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో వివాదం పెద్దదయింది. విజయసాయి రెడ్డి స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై క్లారిటీ ఇవ్వకుండా మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయసాయిరెడ్డి పక్కకు తప్పుకున్నారు.
* సీరియల్ ఎపిసోడ్ గా
తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహార శైలి దుమారం రేపింది. తెలుగు నాట ప్రముఖ వార్తగా నిలిచింది. సీరియల్ ఎపిసోడ్ గా కొనసాగింది. వైసిపి పై విమర్శలకు కారణమైంది. దీంతో ఎట్టకేలకు నాయకత్వం రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని దువ్వాడకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే దువ్వాడ నుంచి సానుకూలత రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకడుగు వేయకూడదని హై కామెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆది నుంచి దువ్వాడ విషయంలో వైసిపి ఉదాసీనంగా వ్యవహరిస్తూనే ఉంది. దీంతో సీరియస్ గా రాజీనామా కోరిందా? లేదా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
* ప్రోత్సహించిన జగన్
దువ్వాడ ఆది నుంచి దూకుడు కలిగిన నేత. ఆ దూకుడే జగన్ వద్ద గుర్తింపు తెచ్చి పెట్టింది. రాజకీయ కారణాలతో జగన్ సైతం దువ్వాడను ప్రోత్సహించారు. జిల్లా పార్టీ నాయకత్వం దువ్వాడ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు అదే దువ్వాడ ఫ్యామిలీ ఇస్తూ వైసిపి పరువు పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న వైసిపి దీనిపై ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం తప్పదని గ్రహించింది. అందుకే జగన్ రాజీనామాకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి దువ్వాడ శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ysrcp chief sent orders to resign from duvwada srinivas mlc post
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com