Bandar Port Foundations : వైఎస్ఆర్, కిరణ్, జగన్ లతో పేర్ని నాని.. కానీ బందర్ పోర్టే ఇంకా పూర్తికాలే!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల వద్ద పనిచేశారు. ముచ్చటగా ముగ్గురు వద్ద పనిచేసినా బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేయించకలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దానినే గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. 

Written By: Dharma, Updated On : May 23, 2023 11:18 am
Follow us on

Bandar Port Foundations : గాంధీగారితో చుప్కే.. నెహ్రూ గారితో చుప్కే…మదర్ థెరిస్సాతో చుప్కే.. ఆ మధ్యన వచ్చిన బద్రినాథ్ సినిమాలో కామెడీ సీన్ ఇది. సాటి కమేడియన్ కుటుంబాన్ని మోసం చేసే క్రమంలో చెప్పే డైలాగు ఇది. ఇప్పుడు పేర్ని నాని విషయంలో ఇటువంటి కామెడీ సీన్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ముచ్చటగా ముగ్గురు సీఎంలతో పేర్ని నాని  ఉన్న ఫొటోలను జత చేస్తూ.. అయినా ఏం లాభం అన్నట్టు అర్ధం వచ్చేలా  పోస్టింగ్ తెగ వైరల్ అవుతోంది. బందరు పోర్టు నిర్మాణానికిగాను సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తండ్రి వైఎస్ చిరకాల ఆశయం నెరవేరిందని చెబుతూ పేర్ని నాని ప్రసంగానికి కౌంటర్ గా పోస్టును పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

బందరుపోర్టు నిర్మాణం ఇప్పటిది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 ఏప్రిల్ 23న బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.కానీ పనులు జరిపించలేకపోయారు. ఆర్థికపరమైన అంశాలు కారణంగా పనులు నిలిచిపోయాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కదలిక వచ్చింది.  2019 ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేశారు. అటు తరువాత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.  మళ్లీ పనులు నిలిచిపోయాయి.  రాజకీయపరమైన అంశాలతో ముడిపెట్టి పోర్టు పనులు జరగనీయలేదు. వైసీపీ అధికారం చేపట్టిన మూడు నెలలకే పోర్టు పనులను సకాలంలో ప్రారంభించలేదనే కారణం చూపి ఈ కాంట్రాక్టును రద్దు చేసింది. దీంతో బందరుపోర్టు పనుల అంశం మొదటికొచ్చింది.

ఎట్టకేలకు పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వాస్తవానికి బందరుపోర్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు, రుణం మంజూరు, న్యాయపరమైన అడ్డంకులు తొలగి పూర్తిస్థాయి అనుమతులు రావడానికి దాదాపు 4 సంవత్సరాల సమయం పట్టింది. గతేడాది డిసెంబరు నుంచి ఇదిగో బందరుపోర్టు పనులు ప్రారంభమంటూ నాలుగైదు విడతలుగా తేదీలను ప్రకటించినా వాయిదా పడ్డాయి. అయితే దీనికి చంద్రబాబును కారణంగా చూపుతున్నారు సీఎం జగన్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని. అయితే 2004 నుంచి 2014 వరకూ మచిలీపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల వద్ద పనిచేశారు. ముచ్చటగా ముగ్గురు వద్ద పనిచేసినా బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేయించకలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దానినే గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.