Raja Reddy Marriage: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అని చాలా మందికి తెలియదు.. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ సోదరి అనగానే అందరూ షర్మిల అంటారు. అంతగా రాజన్న బిడ్డగా, షర్మిల చెల్లిగా ఫేమస్ అయ్యారు. షర్మిల కొడుకు వైఎస్.రాజారెడ్డి పెళ్లి జోధ్ పూర్ ఆదివారం(ఫిబ్రవరి 18న) ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంతా హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు. కానీ, మేనల్లుడి పెళ్లికి మేనమామ ఏపీ సీఎం జగన్ మాత్రం వెళ్లలేదు.
సన్నిహితుల సమక్షంలో..
వైఎస్.షర్మిల – బ్రదర్ అనిల్ దంపతుల కుమారుడు రాజారెడ్డి. అట్లూరి ప్రియతో పెళ్లి నిశ్చయమైంది. జనవరి 18న హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిపించారు. ఈవేడుకకు చాలా మంది పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. తాజాగా జో«ద్‌పూర్‌లో నిర్వహించిన పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే వెళ్లారు. వైఎస్.విజయమ్మ, కుటుంబ సభ్యులు, ఎంపీలు, నాయకులు బంధువులు, సన్నిహితుల నూతన జంటను ఆశీర్వదించారు. జగన్ మాత్రం హాజరు కాలేదు.
జగన్ దంపతులు దూరం..
ఇక ఈ పెళ్లి వేడుకల్లో జగన్–భారతి దంపతులు కనిపించలేదు. విజయమ్మ మాత్రమే వెళ్లారు. కొన్ని రోజులుగా జగన్ టార్గెట్‌గా షర్మిల విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయన అల్లుడి పెళ్లికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ మాత్రం తన చెల్లిపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. వైసీపీ నాయకులు మాత్రం షర్మిలను సున్నితంగా విమర్శిస్తున్నారు.