YS Sharmila : సోదరుడు జగన్మోహన్ రెడ్డిని( Jagan Mohan Reddy) రాజకీయంగా విభేదిస్తున్నారు షర్మిల. ఆస్తుల విషయంలో తలెత్తిన విభేదాలు రాజకీయంగా కూడా వారి మధ్య దూరం పెంచాయి. ఒకరి ఓటమిని ఒకరు కోరుకునే విధంగా పరిస్థితి దారితీసింది. ఇటువంటి తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈరోజు షర్మిల తన అన్న కుటుంబానికి అండగా నిలిచారు. ఐ టి డి పి కార్యకర్త చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగన్ సతీమణి భారతిని ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు. తన వదిన వైయస్ భారతికి మద్దతు ప్రకటించారు. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యల వీడియోను చిత్రీకరించి షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్ పై ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు గ్యాప్ ఏర్పడడానికి భారతి ఒక కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే భారతికి షర్మిల అండగా నిలబడటం మాత్రం నిజంగా విశేషం.
Also Read : గోరంట్ల మాధవ్ చుట్టూ ఉచ్చు.. తెరపైకి ఆ కేసు!
* ఆసక్తికర ట్వీట్
ఈ ఘటన నేపథ్యంలో షర్మిల( Sharmila) ట్వీట్ చేశారు. భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అన్నారు. అటువంటి సైకో గాళ్లను నడిరోడ్డు మీద ఉరితీసిన తప్పు లేదన్నారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదన్నారు షర్మిల. పార్టీ వాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాల్సిందేనన్నారు. వ్యక్తిత్వ అనడానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందన్నారు. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమన్నారు.
* ఘాటు వ్యాఖ్యలతో..
ఈ సందర్భంగా షర్మిల తీవ్ర పదజాలాలను ఉపయోగించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉచ్చం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారని విమర్శించారు. రక్త సంబంధాన్ని మరిచారన్నారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని.. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందాలని షర్మిల గుర్తు చేసుకున్నారు. మన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలను సైతం గుంజరన్నారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను బ్రష్టు పట్టించారని గుర్తు చేశారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడుతూనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుపట్టారు షర్మిల.
Also Read : జగన్ ఫ్యామిలీపై కామెంట్స్.. చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేయాలని టీడీపీ ఆదేశాలు
భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి…
— YS Sharmila (@realyssharmila) April 11, 2025