YS Sharmila sensational comments: రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలు రాజకీయ విభేదాలకు కారణం. ఇది స్పష్టంగా అర్థం అవుతోంది కూడా. ప్రాథమిక స్థాయిలో విభేదాలు ఉన్నప్పుడు తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టకుండా తెలంగాణలో రాజకీయాలు చేసుకోవాలని చూశారు. అయితే ఆ విభేదాలు మరింత ముదరడంతో ఏపీలో తేల్చుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్నారు షర్మిల. అయితే చాలా రోజులుగా వారి మధ్య ఆస్తుల పంచాయతీ నడుస్తూనే ఉంది.. మీడియా ముందుకు వచ్చి షర్మిల గట్టిగానే ఆరోపణలు చేసేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిల పిల్లలను అన్యాయం చేస్తున్నారంటూ స్వయానా తల్లి విజయమ్మ లేఖ విడుదల చేయడంతో ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరిగింది. అయితే బాహటంగా షర్మిల మాదిరిగా ఆయన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే ఆయనకు వకల్తా పుచ్చుకున్నారు కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
జోక్యం అవసరమా?
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ప్రాపకం కోసం ఆయన కుటుంబ వ్యవహారం గురించి కొంతమంది వైసిపి నేతలు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న వైసిపి నేతల కుటుంబాల్లో కూడా ఇలాంటి వివాదాలు నడుస్తుంటాయి. దానికోసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారా? ఒకరి కుటుంబ వ్యవహారంలో మరొకరు తల దూర్చుతారా? కచ్చితంగా తల దూర్చరు. ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరు కలుగజేసుకోరు. పోనీ షర్మిల ఏదో ఆస్తి కోసమో.. రాజకీయ ఆధిపత్యం కోసమో ఆరోపణలు చేశారంటే ఒకలా ఉంటుంది. కానీ ఆమె తల్లి విజయమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నారు. ఆమె చెప్పిన తర్వాత కూడా రాచమల్లు, కొడాలి నాని లాంటి వారు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అదేదో రాజశేఖర్ రెడ్డి వీరికి చెప్పి ఆస్తుల బదలాయింపు చేసినట్టు బదులిస్తున్నారు. అందుకే షర్మిల ఇచ్చి పడేశారు.
షర్మిల హాట్ కామెంట్స్..
ఇటీవల ఆసక్తికర కామెంట్ చేశారు షర్మిల( Y S Sharmila ).’ నా ఆస్తినే నాన్న జగన్ అనుభవిస్తున్నాడు తప్ప నేను అతను ఆస్తిని అనుభవించడం లేదు. నాకు నా సొంత అన్న అన్యాయం చేసినా నేను మౌనంగా తెలంగాణ వెళ్ళిపోయాను తప్ప ఒక్క మాట కూడా అనలేదు. ఆస్తి కోసమే నేను ఆరాట పడుతున్నట్లయితే తెలంగాణ వెళ్లే దానిన.. నా చేతిలో ఉన్న ఆస్తి తాలూకు పత్రాలతో కోర్టుకు వెళ్లకుండా ఉంటానా.. మా కుటుంబ గౌరవం కోసం నేను మౌనంగా ఉండి పోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోర్టుకు వెళ్లి.. ఈ ఆస్తుల పంచాయితీని బయట పెట్టుకున్నారు. కనీసం తల్లి చెల్లి అని చూడకుండా మమ్మల్ని కోర్టుకు ఈడ్చారు. తానంతట తానే ఈ పంచాయతీని రోడ్డుపైకి తెచ్చిపెట్టుకొని ఇప్పుడు మేమేదో మాట్లాడితే జవాబు చెప్పకుండా తన కుక్కలని మాపై ఉసిగొలుపుతున్నారు. ఈ కుక్కల అరుపులకు నేను భయపడే దానిని కాను ‘ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
అయినా వదల్లే..
అయితే షర్మిల కుక్క అనే సరికి బయటకు వచ్చారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి( Racha Mallu Siva Prasad Reddy) . అవును కుక్కలం అంటూ ఒప్పుకున్నారు. జగన్ ఇంట్లో కుక్కలమే. మా యజమానికి ఎవరైనా హాని తల పెడితే మేము తప్పకుండా మొరుగుతాం అంటూ బదులిచ్చారు. అయితే షర్మిల కూడా మళ్లీ స్పందించారు. అమ్మ షర్మిలమ్మ నువ్వు వైసిపి వాళ్లని కుక్కలతో పోల్చకు తల్లి. కుక్కలు బాధపడుతున్నాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు. అనవసరంగా వైఎస్ కుటుంబం అంతర్గత వ్యవహారాల్లో దూరి ఇలా అనిపించుకోవడం ఏమిటనేది సామాన్యుల ప్రశ్న. కానీ ఎందుకో కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తి వ్యవహారాలపై. అందుకే ఇప్పుడు వైసీపీ నేతలు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతున్నారు. విపరీతంగా వారిపై ట్రోల్స్ నడుస్తోంది.
అంత మాట అనేసింది ఏంటి షర్మిల అక్క
ఇది విన్నావా వైస్ భారతి రెడ్డి .. pic.twitter.com/0RlWR2wBsO
— మన ప్రకాశం (@mana_Prakasam) March 25, 2026