https://oktelugu.com/

Bonda Umamaheswara Rao: బోండా ఉమా పై దూసుకొస్తున్న గులకరాయి కేసు

వాస్తవానికి బోండా ఉమాను ఏనాడో టార్గెట్ చేశారు. పల్నాడులో ఆయనపై దాడి కూడా జరిగింది. పోలీస్ కేసులకు సంబంధించి చిక్కలేదు. ఇప్పుడు ఈ గులకరాయి దాడి ఎపిసోడ్ ని తీసుకుని అరెస్టు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : April 18, 2024 11:25 am
    Bonda Umamaheswara Rao

    Bonda Umamaheswara Rao

    Follow us on

    Bonda Umamaheswara Rao: ఏపీలో ఇప్పుడు రాళ్ల రాజకీయం నడుస్తోంది. సీఎం జగన్ పై గులకరాయితో దాడి జరిగిన తర్వాత.. ఇదో రాజకీయ అంశంగా మారిపోయింది. అధికార విపక్షాల మధ్య పెద్ద ఫైట్ నడుస్తోంది. అయితే ఈ గులకరాయి దాడి అటు తిరిగి ఇటు తిరిగి.. టిడిపి సీనియర్ నేత బొండా ఉమాపై పడింది. ఈ ఘటనకు పాల్పడింది ఐదుగురు యువకులని.. వారంతా మైనర్ లేనని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు బోండా ఉమా అనుచరుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి స్టేట్మెంట్లు తీసుకొని ఉమా పై కేసుల నమోదుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు టిడిపి నేతలు అనుమానిస్తున్నారు.

    వాస్తవానికి బోండా ఉమాను ఏనాడో టార్గెట్ చేశారు. పల్నాడులో ఆయనపై దాడి కూడా జరిగింది. పోలీస్ కేసులకు సంబంధించి చిక్కలేదు. ఇప్పుడు ఈ గులకరాయి దాడి ఎపిసోడ్ ని తీసుకుని అరెస్టు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు వడ్డేర బస్తీలో పిల్లలను పావులుగా వాడుకుంటున్నారు. వారిచ్చిన స్టేట్మెంట్తో బోండా ఉమా అనుచురుడిపై పడ్డారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు బోండా ఉమా పై చర్యలకు ఉపక్రమించనున్నారు. అయితే ఈ బలవంతపు స్టేట్మెంట్లు న్యాయస్థానంలో పనిచేయవు. కానీ ఎన్నికల ముంగిట ఇబ్బంది పెట్టాలనుకుంటున్న తరుణంలో.. ఉమాను అరెస్ట్ చేసే చాన్స్ కనిపిస్తోంది. అయితే ఇది కోర్టులో నిలబడే అవకాశం లేదు కానీ.. అరెస్టు చేసి జైల్లో ఉంచడం ద్వారా బోండా ఉమా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు.

    అయితే ప్రస్తుతం ఏపీలో యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం మాటే చెల్లుబాటు అవుతోంది. ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చాలామంది అధికారులు విపక్షాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు వారికి కనిపించడం లేదు. కెసిఆర్ కూడా ఇదే మాదిరిగా వ్యవహరించారు. ఆయనకు చాలామంది అధికారులు సహకరించారు. ఇప్పుడు వారంతా బాధపడుతున్నారు. ఏపీలో కూడా అటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అధికారులు జాగ్రత్త పడుకుంటే మూల్యం తప్పదు.