Ram Charan: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలను సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్,ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే నెక్స్ట్ ఆర్ సి 17 కోసం సుకుమార్ ని కూడా లైన్ లో పెట్టాడు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మరొక స్టార్ డైరెక్టర్ ను కూడా రామ్ చరణ్ లైన్ లో పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరు అంటే కేజీఎఫ్, సలార్ సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న ప్రశాంత్ నీల్..ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ చెప్పిన ఒక పాయింట్ చరణ్ కి చాలా బాగా నచ్చిందట. దాంతో ఆ లైన్ ను తన కోసం హోల్డ్ లో పెట్టమని చెప్పాడట. దానికి ప్రశాంత్ నీల్ కూడా ఒకే అన్నాడట… ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా ఈ సంవత్సరం ఎండింగ్ లో సెట్స్ మీదికి వెళ్ళబోతుంది. ఇక 2026 సంక్రాంతి కానుకగా ఎన్టీయార్ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన లో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ 2 సినిమా కూడా చేయాల్సి ఉంది. మరి ఆ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తాడు అనే డౌట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే రామ్ చరణ్ సినిమా అయిపోయిన తర్వాత సలార్ 2 ను సెట్స్ మీదకి తీసుకువస్తాడట. ఇక అప్పటివరకు ప్రభాస్ కూడా తనకున్న కమిట్ మెంట్లు అన్నింటిని పూర్తి చేసి ఫ్రీ అయిపోతాడు. కాబట్టి అప్పుడు సలార్ 2 సినిమాని ప్రభాస్ తో ఈజీగా తీసేసుకోవచ్చనే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది..