https://oktelugu.com/

YS Jagan – Sharmila : జగన్, షర్మిల అప్పుల వెనుక కథేంటి?

షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలకు మాత్రమే జగన్ హాజరయ్యారు. వివాహానికి హాజరు కాలేదు. అయితే ఇటువంటి విభిన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో షర్మిల జగన్ వద్ద అప్పు తీసుకోవడం ఏమిటి? ఇంతవరకు తిరిగి చెల్లించకపోవడం ఏమిటి? అన్నది అంతు పట్టడం లేదు. అయితే ఈ అప్పుల వెనుక ఏదో ఒక కథ ఉందన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుపుతున్నాయి. అవి ఏమిటి అన్నది షర్మిలే బయట పెట్టాలి.

Written By:
  • NARESH
  • , Updated On : April 21, 2024 / 11:48 AM IST

    Jagan Sharmila Debts

    Follow us on

    YS Jagan – Sharmila : సీఎం జగన్ పై ఆయన సోదరి గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. రాజకీయంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి తమ సేవలను వినియోగించుకున్న జగన్.. తీరా అధికారంలోకి వచ్చాక రోడ్డున పడేశారని తరచూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అటు తండ్రి కేటాయించిన ఆస్తిపాస్తుల విషయంలో సైతం వారి మధ్య అరమరికలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి విధితమే. అయితే షర్మిల దాదాపు 80 కోట్ల వరకు తన అన్న జగన్ కు అప్పు ఉన్నట్లు తాజాగా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అంత మొత్తంలో అప్పు ఇచ్చిన జగన్ కు కృతజ్ఞత చూపాల్సింది పోయి.. తనను పట్టించుకోవడం లేదని షర్మిల చెబుతుండడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

    షర్మిల కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. స్థిర, చరాస్తులతో పాటు అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. తన కుటుంబ మొత్తం ఆస్తులు విలువను 182. 82 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. వీటిలో 9 కోట్ల 29 లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మరో 123 కోట్ల రూపాయలను చరాస్తులుగా చూపారు. ఈ అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే షర్మిల వద్ద మూడు కోట్ల 69 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటు నాలుగు కోట్ల 61 లక్షల వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు ఉన్నట్టు చూపారు. అదే సమయంలో అప్పులుగా 82 కోట్ల 58 లక్షల రూపాయలను చూపించారు. అయితే ఈ అప్పు తన సోదరుడు జగన్ నుంచి తీసుకున్నట్లు షర్మిల చెబుతుండడం ఆశ్చర్యం వేస్తోంది. తన వదిన భారతి నుంచి కూడా 19,56000 రూపాయలు అప్పు చేసినట్లు ఆమె చెబుతుండడం విశేషం.

    అయితే ఈ అప్పుల కథ వెనుక ఉన్న అసలు గుట్టు ఏమిటన్నది తెలియాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా జగన్తో షర్మిల రాజకీయంగా విభేదిస్తున్నారు. తెలంగాణలో సొంతంగా పార్టీని పెట్టారు. వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ పగ్గాలు అందుకున్నారు. నేరుగా అన్నను ఢీకొడుతు న్నారు. అయితే వీరి మధ్య మాటలు కూడా లేనట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలకు మాత్రమే జగన్ హాజరయ్యారు. వివాహానికి హాజరు కాలేదు. అయితే ఇటువంటి విభిన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో షర్మిల జగన్ వద్ద అప్పు తీసుకోవడం ఏమిటి? ఇంతవరకు తిరిగి చెల్లించకపోవడం ఏమిటి? అన్నది అంతు పట్టడం లేదు. అయితే ఈ అప్పుల వెనుక ఏదో ఒక కథ ఉందన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుపుతున్నాయి. అవి ఏమిటి అన్నది షర్మిలే బయట పెట్టాలి.