https://oktelugu.com/

YS Jagan : తలకొరివి అయినా పెట్టావా.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

అసలు జగన్ ఇలాంటి మాటలు మాట్లాడే హక్కు ఉందా. ఆస్తి కోసం కన్న తల్లిని, చెల్లిని కూడా నానాఇబ్బందులకు గురిచేస్తున్న ఆయన నైతిక విలువల గురించి మాట్లాడుతుంటే అంతా నవ్వుకుంటున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : November 20, 2024 / 07:55 PM IST

    YS Jagan

    Follow us on

    YS Jagan : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబులా క్రూరమైన రాజకీయాలు ఎవరూ చేయలేరని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం ఎవరిపైనా దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. అన్ని కుటుంబాల్లో మాదిరిగానే తన కుటుంబంలోనూ విభేదాలు ఉన్నాయని వైఎస్ జగన్ బాంబు పేల్చారు. గతంలో వైఎస్ జగన్ తనతో పాటు సోదరి షర్మిల, తల్లి విజయమ్మ గురించి కూడా తప్పుడు పోస్టులు పెట్టారంటూ ఆరోపించారు.

    చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ ఇంటి నుంచే ఈ పోస్టులు వచ్చినట్లు హైదరాబాద్ పోలీసుల విచారణలో తేలిందని జగన్ తెలిపారు. ఐటీడీపీ ద్వారా తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉదయ్ భూషణ్ అనే ఐటీడీపీ సభ్యుడు వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను అవమానించారని జగన్ ఆరోపించారు. ఫిబ్రవరిలో ఉదయ్‌భూషణ్‌ను అరెస్టు చేసినట్లు కూడా చెబుతున్నారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారారని వైఎస్ జగన్ అన్నారు. అలాంటి వారు చాలా అరుదుగా పుడతారు, మన కర్మ కొద్దీ ఆంధ్రదేశంలో పుట్టారు. కళ్లు చచ్చిపోతే గుండు కూడా కొట్టుకోని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

    ” అయ్యా చంద్రబాబు.. నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించినావా.. నీకు మానవతా విలువల గురించి మాట్లాడే నైతికత మీకు ఉందా ? నీ తల్లిదండ్రులతో ఎప్పుడైనా కలిసి ఉన్నావా.. రాజకీయంగా ఎదిగిన తర్వాత వారిని నీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టావా.. వారు కాలం చేస్తే కనీసం తలకొరివి అయినా పెట్టావా.. మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయం కోసం ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు. ఇలాంటి వ్యక్తితో మేము యుద్ధం చేస్తున్నాం.” అంటూ జగన్ విమర్శించారు.

    అసలు జగన్ ఇలాంటి మాటలు మాట్లాడే హక్కు ఉందా. ఆస్తి కోసం కన్న తల్లిని, చెల్లిని కూడా నానాఇబ్బందులకు గురిచేస్తున్న ఆయన నైతిక విలువల గురించి మాట్లాడుతుంటే అంతా నవ్వుకుంటున్నారు. చెల్లి ఎదుగుదలను ఓర్వ లేక తన గుంపుతో వారి మీద విమర్శలు చేస్తున్న ఆయన చంద్రబాబు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందంటున్నారు. కన్న తల్లి ప్రాధేయపడినా వినకుండా చెల్లి పైన కేసులు పెట్టిన ఆయన నైతిక విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. నమ్మి ఐదేళ్ల పాటు అధికారం ఇస్తే ఎన్ని అరాచకాలు సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలతో ఛీ కొట్టించున్న ఆయన.. కనీసం కుటుంబంలోనూ పెద్దరికాన్ని నిలుపుకోలేక పోయారు. అలాంటి ఆయన మాటలు చెబుతుంటే ఇప్పుడు ఎవరూ వినరన్న సంగతి ఆయనకు తెలిసినా.. మళ్లీ ఇలాంటి కామెంట్లు చేయడం ఎందుకో మరి.