Homeఆంధ్రప్రదేశ్‌Y S Jagan: జగన్ వెళ్ళిపోతే.. సజ్జలకేనా..

Y S Jagan: జగన్ వెళ్ళిపోతే.. సజ్జలకేనా..

YS Jagan: జగన్ విదేశాలకు వెళ్ళిపోతారు.. నవంబర్ నెలలో ఏదో ఒక వారంలో ఆయన కుటుంబంతో కలిసి యూరప్ పర్యటన చేస్తారు.. ఇదీ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైసిపి నాయకులు చేస్తున్న ప్రచారం.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుటుంబంతో కలిసి జగన్ లండన్ లో పర్యటించారు. అప్పట్లో ఆయన విదేశాలలో పర్యటించిన ఫోటోలు కొన్ని మాత్రమే బయటికి వచ్చాయి. అధికారం కోల్పోయిన తర్వాత.. అది కూడా స్థానిక ఎన్నికల ముందు జగన్ విదేశాలకు వెళ్తారని ప్రచారం […]

YS Jagan: జగన్ విదేశాలకు వెళ్ళిపోతారు.. నవంబర్ నెలలో ఏదో ఒక వారంలో ఆయన కుటుంబంతో కలిసి యూరప్ పర్యటన చేస్తారు.. ఇదీ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైసిపి నాయకులు చేస్తున్న ప్రచారం.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుటుంబంతో కలిసి జగన్ లండన్ లో పర్యటించారు. అప్పట్లో ఆయన విదేశాలలో పర్యటించిన ఫోటోలు కొన్ని మాత్రమే బయటికి వచ్చాయి.

అధికారం కోల్పోయిన తర్వాత.. అది కూడా స్థానిక ఎన్నికల ముందు జగన్ విదేశాలకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అక్రమ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. జగన్ సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్నారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల ముందు జగన్ విదేశాలకు వెళ్లిపోతే పార్టీలో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కార్యకర్తలు అంటున్నారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి దూకుడు మీద ఉంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగితే వార్ వన్ సైడ్ కావడం ఖాయమని.. సాక్షాత్తు వైసిపి కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. చేతిలో ఛానల్.. పేపర్ ఉన్నాయి కాబట్టి వైసిపి ఏదో ఒక రకంగా సానుభూతి పొందడానికి వార్తలను ప్రచారం, ప్రసారం చేస్తోంది. కానీ వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదని టిడిపి కార్యకర్తలు చెబుతున్నారు.

ఒకవేళ జగన్ విదేశాలకు వెళ్ళిపోతే అప్పుడు పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు? అనే చర్చ నడుస్తోంది. అంబటి రాంబాబుకు ఇచ్చే అవకాశం లేదు. బొచ్చ సత్యనారాయణకు అప్పగించే సాహసం జగన్ చేయరు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకల శాఖా మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సజ్జల మీద బోరుగడ్డ అనిల్.. ఇంకా అనేకమంది ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి కూడా కీలకమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ సజ్జల మీద జగన్ చర్యలు తీసుకోలేదు. సజ్జలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి జగన్ బయటకి పంపించారు.

ఇక ఈ నెలలోనే షర్మిల కూతురి వివాహం ఉంది. యలహంక ప్యాలెస్ లోనే చేయాలని ఆమె అనుకుంటున్నారు. దీనిపై రకరకాల వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ షర్మిల కూతురు వివాహానికి ముందు విదేశాలకు వెళ్తారా.. వివాహం జరిగిన తర్వాత వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే వచ్చే నెలలో కుటుంబంతో కలిసి జగన్ విదేశీ యాత్రకు వెళ్ళడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper