Yoga Day Mats Viral Video: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యువ దినోత్సవం ఘనంగా జరిగింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. యోగా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంస్కృతిక శ్లోకాలను చదివిన నిర్వాహకులు.. దానికి తగ్గట్టుగా యోగాసనాల గురించి వివరించడం ఈ సందర్భంగా విశేషం.
Scenes After Yogandhra In Vizag!!
each one 3 mats tiskoni vellaru anta ❤️ pic.twitter.com/5OpWEQ1vhI
— sai chowdary (@saiholicc) June 21, 2025
విశాఖపట్నం పర్యటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కొద్దిరోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మంత్రులతో కూడా భేటీ నిర్వహించారు. ప్రత్యేకంగా అధికారులను నియమించారు. లక్షలాదిమంది తరలిరావడంతో యోగా దినోత్సవం విజయవంతమైంది. ప్రభుత్వం అంచనా వేసిన దాని కంటే ప్రజలు ఎక్కువగా వచ్చారు. దీంతో విశాఖపట్నంలో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. వచ్చిన జనంతో విశాఖపట్నం కిటకిటలాడింది. ఉదయమే అంతర్జాతీయ యోగా వేడుకలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా యోగాసనాలు వేశారు.. వారితోపాటు వచ్చిన వారు కూడా యోగాసనాలు వేశారు.
Also Read: Nara Brahmani Latest Video: యోగాంధ్రలో నారా బ్రాహ్మణి.. స్పెషల్ అట్రాక్షన్.. వీడియో
ఇదే హైలెట్
యోగాసనాలు వేసిన తర్వాత వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అందజేసిన మ్యాట్ లు తమ వెంట తీసుకెళ్లారు. వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ఒక్కొక్కరు మూడు మ్యాట్లు తీసుకెళ్లడం విశేషం. ఈ మ్యాట్లు అత్యంత నాణ్యంగా ఉండడంతో తమ వెంట తీసుకువెళ్లారు. ఎందుకంటే ఈ మ్యాట్ మీద ప్రతిరోజు ఉదయం యోగాసనాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రజలు భావించారు. అందులో భాగంగానే వచ్చినవారు తమ వెంట మ్యాట్లను తీసుకెళ్లారు.. కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్కరు మూడు మ్యాట్లను తమ వెంట తీసుకు వెళ్ళడం.. ఈ దృశ్యాలను కొంతమంది తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ దృశ్యాలు కాస్త వైరల్ గా మారాయి. ” యోగా దినోత్సవం విజయవంతమైంది. ప్రజలు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగాసనాలు వేసి సందడి చేశారు. అయితే హాజరైన వారిలో కొంతమంది మ్యాట్లు అక్కడే పెట్టి వెళ్లిపోగా.. మరికొందరేమో తమ వెంట తీసుకుని వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు చూసేందుకు నవ్వు తెప్పించినప్పటికీ.. జనాలు ఫ్రీగా వస్తే దేనిని వదిలిపెట్టరు అని అర్థమైంది. చివరికి మ్యాట్ల విషయంలో కూడా వారు ఇలా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని” నెటిజన్లు అంటున్నారు. అయితే కొంతమంది టీ షర్ట్ లను కూడా అక్కడే వదిలి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే.. వాలంటీర్లు వారించినట్లు సమాచారం.
Okkokkaru 3-4 mats sardesaru deenikosam 300+cr bokka pic.twitter.com/jknQgzzv5Y
— Bujji Kanna Naidu (@ZingZing_Zack) June 21, 2025