YCP Third List: సుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ తన మూడో జాబితాను ప్రకటించింది. ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో జాబితాను వెల్లడించింది. రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చల అనంతరం అభ్యర్థుల పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారు. తొలి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా అభ్యర్థుల మార్పుతో మొత్తం 53 మంది అభ్యర్థులను మార్చినట్లు అవుతుంది.
* ఎంపీ అభ్యర్థులకు సంబంధించి విశాఖపట్నం బొత్స ఝాన్సీ లక్ష్మి, విజయవాడ కేశినేని నాని, కర్నూలు గుమ్మనూరు జయరాం, ఏలూరు కారుమూరు సునీల్ కుమార్, తిరుపతి కోనేటి ఆదిమూలం, శ్రీకాకుళం పేరాడ తిలక్ లను ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
* అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇచ్చాపురం పిరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి కంభం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు విజయానంద రెడ్డి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు బుసినే విరూపాక్షి, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరిగ మురళి, సత్యవేడు మద్దిల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పల రాములను అభ్యర్థులుగా ఖరారు చేస్తూ వైసిపి మూడో జాబితా వెల్లడయ్యింది. అయితే చాలామంది ఆశావహులకు చాన్స్ లేకుండా పోయింది. టెక్కలి నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును జగన్ అనూహ్యంగా ఎంపిక చేశారు. కొద్దిరోజుల కిందట ఆయన భార్య దువ్వాడ వాణిని ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని మళ్లీ శ్రీనివాస్ కు ఛాన్స్ ఇవ్వడం కుటుంబంలో వివాదాలకు ఆజ్యం పోసినట్టు అయ్యింది.