Kalki 2898 AD: ప్రభాస్ కెరీర్లో తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్ మూవీ కల్కి 2829 AD. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా కల్కి చిత్రీకరణ జరుపుకుంటుంది. ఫస్ట్ టైం ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. కల్కి అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతుంది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు.ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాత.
కల్కి మూవీ విడుదల తేదీ మారుతూ వచ్చింది. గతంలో కల్కి 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు . అయితే షూటింగ్ పూర్తి కాలేదు. ఈ కారణం పోస్ట్ ఫోన్ చేశారు. కల్కి విడుదల తేదీగా ప్రకటించిన జనవరి 12న కొత్త విడుదల తేదీ వెల్లడించాడు. సమ్మర్ కానుకగా కల్కి మే 9న విడుదల కానుంది. దీనికి సంబంధించిన స్పెషల్ ప్రోమో విడుదల చేశారు.
భారీ బడ్జెట్ మూవీ కావడంతో సమ్మర్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక కల్కి చిత్ర కథపై ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. ఇది టైం ట్రావెలర్ మూవీ. భవిష్యత్ లో ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తున్నాం అంటున్నారు. దీనికి సంబంధించిన నగరాలు మెస్మరైజ్ చేస్తాయి అంటున్నారు. ప్రభాస్ సూపర్ హీరోగా విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడని సమాచారం.
ఇక కల్కి చిత్రంలో భారీ క్యాస్టింగ్ నటిస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ రాకతో కల్కి పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి. ఆయన విలన్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్ బచ్చన్ మరో కీలక రోల్ చేస్తున్నారు. దిశా పటాని సైతం నటిస్తుంది. కల్కి విడుదలైన ఉన్న అనుమానాలు నేటితో వీడిపోయాయి.