Mohan Babu: హీరోయిన్ ‘సౌందర్య’ నుండి వందల కోట్ల రూపాయిల ఆస్తులను సొంతం చేసుకున్న మోహన్ బాబు..బయటపడ్డ సంచలన నియం!

బ్రతికి ఉండుంటే ఇప్పటికీ ఎన్నో మర్చిపోలేని అద్భుతమైన సినిమాలు, క్యారెక్టర్స్ చేసి ఉండేది, కానీ దురదృష్టం కొద్దీ ఆమె 2004 వ సంవత్సరంలో బీజేపీ పార్టీ తరుపున ప్రచారం కోసం హెలికాప్టర్ లో వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలింది.

Written By: Vicky, Updated On : October 1, 2024 3:57 pm

Mohan Babu

Follow us on

Mohan Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంత మంది నటీనటలు సజీవంగా ఉన్నా లేకపోయినా తరతరాలకు గుర్తునిపోయేలా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటారు. అలాంటి నటీనటుల జాబితాలో సౌందర్య కచ్చితంగా ఉంటుంది. ఈమె నటనను మహానటి సావిత్రి తో పిలిచి చేస్తుంటారు మన ఆడియన్స్. ఎలాంటి ఓవర్ డ్రామా లేకుండా, ఎంతో సహజంగా నటించడం సౌందర్యకి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ప్రతీ హీరోతో ఆమెకి ఆన్ స్క్రీన్ మీద అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటుంది. నిజమైన భార్యాభర్తలుగా అనిపిస్తారు. అది సౌందర్య లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆమెలో ఉన్న మ్యాజిక్ ని ఏ స్టార్ హీరోయిన్ కూడా నేటి తరంలో మ్యాచ్ చేయలేకపోయారు. అందుకే సౌందర్య ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. 12 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఆమె అన్ని భాషలకు కలిపి దాదాపుగా 100 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.

బ్రతికి ఉండుంటే ఇప్పటికీ ఎన్నో మర్చిపోలేని అద్భుతమైన సినిమాలు, క్యారెక్టర్స్ చేసి ఉండేది, కానీ దురదృష్టం కొద్దీ ఆమె 2004 వ సంవత్సరంలో బీజేపీ పార్టీ తరుపున ప్రచారం కోసం హెలికాప్టర్ లో వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలింది. ఈ ఘటన అప్పట్లో యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ముఖ్యంగా సౌందర్య ని విపరీతంగా అభిమానించే వారిలో మోహన్ బాబు కూడా ఒకరు. అప్పట్లో ఆమె మరణ వార్త తెలుసుకున్న మోహన్ బాబు, మీడియా ముందు వెక్కిళ్లు పెట్టి ఏడ్చిన ఘటన ఇప్పటికీ మరచిపోలేము. సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె కుటుంబం సంక్షోభంలోకి వెళ్ళింది. సౌందర్య భర్త ఆమె ఆస్తులన్నీ తీసుకొని వేరే పెళ్లి చేసుకొని ఉడాయించాడు. సౌందర్య తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేసి ఆస్తులను దక్కించుకున్నారు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు సౌందర్య తమ పేరిట రాసిన ఒక ఆస్తిని మోహన్ బాబు కి అమ్మారట. హైదరాబాద్ లోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జల్ పల్లి సమీపంలో సౌందర్య హీరోయిన్ గా కొనసాగుతున్న రోజుల్లో 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయితే ఈ భూమిని ఆమె తల్లిదండ్రుల పేరిట రిజిస్టర్ చేయించింది సౌందర్య.

ఆమె చనిపోయిన తర్వాత ఎన్నో ఆర్ధిక ఇబ్బందులకు గురైన తల్లిదండ్రులు ఆ ఆస్తిని మోహన్ బాబు కి అమ్మేసారట. అక్కడ మోహన్ బాబు అందమైన భవనాన్ని నిర్మించుకొని మంచు టౌన్ షిప్ అని నామకరణం చేశాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ అనే సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టిన సౌందర్య, చివరిసారిగా ‘శ్వేత నాగు’ అనే చిత్రం తో వెండితెర పై కనిపించింది. ఈ సినిమా విడుదలకు ముందే సౌందర్య చనిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు బెంగళూరు లో నివసిస్తున్నట్టు తెలుస్తుంది.