https://oktelugu.com/

YCP: ఆ సంప్రదాయానికి వైసీపీ బ్రేక్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభలో అత్యధికంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అయ్యన్నపాత్రుడిని స్పీకర్ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 22, 2024 / 03:51 PM IST

    YCP

    Follow us on

    YCP: గెలిస్తే తమది.. ఓడిపోతే ఈవీఎంలది అన్నట్టు ఉంది వైసీపీ పరిస్థితి. గెలిచినా, ఓడినా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. తప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగాలి. కానీ వైసీపీ వ్యవహార శైలి అలా లేదు. గత ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో విజయం సాధించి ఉత్సాహంతో అడుగులు వేసింది ఆ పార్టీ. కానీ ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి తట్టుకోలేకపోతోంది. నిన్నటికి నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసిపి.. రెండో రోజు మాత్రం బహిష్కరించింది. ఇవాళ సభలో స్పీకర్ కార్యక్రమం ఉంది. స్పీకర్ని సభాపతి చీరలు కూర్చోబెట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షానికి ఉంటుంది. 11 సీట్లు వచ్చినా.. వైసిపి ప్రతిపక్షమే అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. పైగా తొలి రోజు ప్రతిపక్ష నేతకు సమానమైన గౌరవం కల్పించింది ప్రభుత్వం. తప్పకుండా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అది స్పీకర్ విచక్షణ అధికారం పై ఆధారపడి ఉంది కూడా. కానీ అదే స్పీకర్ బాధ్యతలు అప్పగించే కార్యక్రమానికి గైర్హాజరై.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది వైసిపి.

    ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభలో అత్యధికంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అయ్యన్నపాత్రుడిని స్పీకర్ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు. ఒకటే నామినేషన్ కావడంతో అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనంగా మారింది. ఈరోజు ఉదయం ఆయనను సభాపతిగా సీట్లో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ డుమ్మా కొట్టడంతో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా ఈ గౌరవ కార్యక్రమం సాగింది.

    వాస్తవానికి ఈ కార్యక్రమం చేయాల్సింది ప్రతిపక్షం. స్పీకర్ అధికార పార్టీ నేత అయినా.. ఆయన రాగద్వేషాలకు అతీతంగా.. అన్ని పక్షాలను సమాన దృష్టిలో చూస్తారు కాబట్టి.. స్పీకర్ కి ఆ గౌరవం ఇస్తూ ప్రతిపక్షం ఈ సంప్రదాయం పాటిస్తోంది. కానీ వైసిపి ఇప్పుడు దానికి చెప్పినట్లు అయింది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్ తనకేమీ పట్టనట్టు.. సొంత నియోజకవర్గ పులివెందులకు వెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు జరగవు. అవి జరిగేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం రాజకీయ పార్టీలపై ఉంది. కనీసం తనకు 40 శాతం ప్రజలు ఆమోదం ముద్ర వేశారన్న విషయాన్ని కూడా జగన్ మరిచిపోతున్నారు. ఈ విషయంలో జగన్ గుణ పాఠాలు నేర్చుకోకుంటే మరోసారి మూల్యం తప్పదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.