Hari Hara Veeramallu: ఒక సినిమాని తీయడం ఎంత ఇంపార్టెంటో ఆ సినిమాని సరైన సమయంలో రిలీజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్…కొన్ని పర్టిక్యులర్ సీజన్ లలో సినిమాలను రిలీజ్ చేసినప్పుడు మాత్రమే ఆ సినిమాకి జనాల నుంచి విశేషమైన ఆదరణ అయితే వస్తుంది. అందుకే సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో చాలామంది ప్రొడ్యూసర్స్ పోటీ పడుతూ ఉంటారు…
Also Read: 3 ఏళ్లలోనే తిరుగుముఖం..ఎర్టిగాకు పోటీ ఇవ్వలేకపోయిన కియా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ (Pavan Kalyan) కి ఉన్న క్రేజ్ ను మాత్రం టచ్ చేసే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన ఒకపక్క పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉంటూనే, మరోపక్క సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలో కీలక పాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన హీరోగా జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా ఈనెల 30వ తేదీన రిలీజ్ అవుతోంది అంటూ మేకర్స్ ప్రకటించినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాను జూన్ 12వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా దాదాపు 6 నుంచి 7 సార్లు రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఇక దీన్ని కూడా పోస్ట్ పోన్ చేసినట్లయితే అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యే అవకాశం అయితే ఉంది. మరోసారి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయాలనుకున్నారా అనే విషయంలో సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలు అయితే బయటికి వస్తున్నాయి…
అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉండడంతో ఇంకొంత సమయం అయితే కావాల్సి ఉందట…దానివల్ల 30వ తేదీన కాకుండా జూన్ 12వ తేదీన వస్తే అన్ని సెట్ అవుతాయి అని వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బుక్ మై షో లో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ జూన్ 12 అని చూపిస్తోంది.
దీన్ని బట్టి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికి జూన్ 12వ తేదీన ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది… మరి దీని మీద పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాంటి స్పందనను తెలియజేస్తారు. వాళ్ళు మరోసారి నిరాశకు గురవ్వాల్సిందేనా అంటూ మరికొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
సినిమా యూనిట్ ఈనెల 30వ తేదీ రిలీజ్ క్యాన్సల్ అయిందని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇప్పటివరకు 30వ తేదీన వస్తుంది అని అభిమానులైతే అనుకుంటున్నారు. ఇక బుక్ మై షో లో మాత్రం జూన్ 12 అని చూపిస్తోంది. ఈ సినిమా ఏ డేట్ కి వస్తుంది అనేది క్లారిట్ గా తెలియాలంటే సినిమా టీమ్ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది…