Hindoopuram  : బాలయ్య కొట్టిన పంజా.. హిందూపురంలో అంతా వన్ సైడ్.. పత్తాలేని వైసీపీ లీడర్స్!

టిడిపికి బలమైన నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి.వరుసగా అక్కడ హ్యాట్రిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ.ఈసారి ఆయనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసిపి నేతలు శపధం చేశారు. కానీ ఇప్పుడు అక్కడ వైసీపీకి ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం.

Written By: Dharma, Updated On : August 21, 2024 6:23 pm

Hindupuram Municipality

Follow us on

Hindoopuram : హిందూపురం మున్సిపాలిటీ టిడిపి ఖాతాలో చేరనుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు వైసిపి చాలా పెద్ద స్కెచ్ వేసింది. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు హిందూపురంను ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో నందమూరి బాలకృష్ణను ముప్పు తిప్పలు పెట్టారు. నాలుగు మండలాల్లో టిడిపి నేతలను కొనుగోలు చేసేశారు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టిడిపి యాక్టివ్ నాయకులపై ఫోకస్ పెట్టారు. కేసులతో భయపెట్టారు. మరికొందరిని డబ్బులతో కొనుగోలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని శపధం చేశారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకలా భావిస్తే.. హిందూపురం ప్రజలు మరోలా భావించారు. వైసీపీని దారుణంగా ఓడించారు. పెద్దిరెడ్డి కాదు కదా.. ఇక్కడ వైసిపి నుంచి పోటీ చేసిన నేత కూడా కనిపించడం మానేశారు. పట్టించుకోవాల్సిన నాయకత్వం పత్తా లేకపోవడంతో పార్టీ శ్రేణులు సైతం చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్ళిపోయారు. దీంతో చాలామందిఅస్త్ర సన్యాసం చేస్తున్నారు. పదవులకు రాజీనామా చేసి టిడిపికి లైన్ క్లియర్ చేస్తున్నారు. తాజాగా హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వారి రాజీనామాను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కొత్తగా టిడిపి నేతలు చైర్మన్ గా ఎంపిక అయ్యేందుకు మార్గం సుగమం అయింది.

* మున్సిపల్ చైర్ పర్సన్ జంప్
వైసీపీ నుంచి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఇంద్రజ ఎంపికయ్యారు. ఇటీవల ఆమె వైసీపీని వీడారు. ఓ 12 మంది కౌన్సిలర్లతో కలిసి టిడిపిలో చేరారు. అయితే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వారిని నిలదీయాలని వైసీపీ కౌన్సిలర్లకు పిలుపునిచ్చింది హై కమాండ్. పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేయకుండా.. టిడిపిలోకి ఎలా వెళ్తారని నిలదీయాలని ఆదేశించింది. ఈ ప్రశ్న వచ్చేసరికి చైర్ పర్సన్ ఇంద్రజాతో పాటు వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మరో వారం రోజుల్లో చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది.

* వ్యూహాత్మకంగా బాలయ్య
హిందూపురం మున్సిపాలిటీలో టిడిపి జెండా ఎగురవేయాలని బాలకృష్ణ భావించారు. అందుకు తగ్గట్టు ప్లాన్ రూపొందించారు. అయితే వైసిపి కౌన్సిలర్ల సాయంతో.. ఎటువంటి విమర్శలు రాకుండా చూసుకోవాలని భావించారు. అందుకే చైర్ పర్సన్ పదవికి ఆమెతో రాజీనామా చేయించారు. మళ్లీ టీడీపీ నేతను కొత్తగా చైర్మన్ గా ఎంపిక చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే టిడిపి నేత రమేష్ ను చైర్మన్ గా ఎంపిక చేశారు. మరో వారం రోజుల్లో ఆయన చైర్మన్ గా ఎంపిక కావడం ఖాయం.

* వైసీపీ నేతలు పరార్
హిందూపురంలో బాలకృష్ణ ఓడించేందుకు జగన్ తో పాటు పెద్దిరెడ్డి అహర్నిశలు శ్రమించారు. ఎప్పటికప్పుడు అభ్యర్థులను మార్చారు. అదే బాలకృష్ణకు వరంగా మారింది. గతంలో బాలకృష్ణ వెంట నడిచిన నేతలను బలవంతంగా లాక్కున్నారు. కొత్తగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ నేతను రంగంలోకి దించారు. హిందూపురం ఎంపీగా బళ్లారి మహిళా నేతను బరిలో దించినా ఫలితం లేకపోయింది. పోటీ చేసిన నేతలంతా వెళ్లిపోగా.. వైసీపీ ప్రజా ప్రతినిధులు యూటర్న్ తీసుకున్నారు. ఫలితంగా హిందూపురం టిడిపికి మరోసారి కంచుకోటగా మారింది.