Homeఆంధ్రప్రదేశ్‌Jagan: హెచ్చరిస్తున్న బాబూ.. తొడగొట్టిన జగన్.. వైరల్ వీడియో

Jagan: హెచ్చరిస్తున్న బాబూ.. తొడగొట్టిన జగన్.. వైరల్ వీడియో

Jagan: జగన్ రంగంలోకి దిగారు. ఓటమి నుంచి చేరుకున్నారు. వైసీపీ శ్రేణులతో వరుసగా సమావేశం అవుతూ వస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఎన్నికల పోలింగ్ నాడు జరిగిన విధ్వంసాలకు బాధ్యుడిగా చేస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ కు సుతిమెత్తగా హెచ్చరించారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. ప్రస్తుతం జగన్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపుతున్నాయి.

ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలయ్యింది. 11 స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరోవైపు చూస్తే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పై దాడులు పెరిగాయి. కేసులు నమోదవుతున్నాయి. అధికార పక్షం దూకుడుగా ఉండడంతో.. వైసీపీ శ్రేణులు ఇంటికే పరిమితం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వైసీపీ శ్రేణులు గ్రామాలను విడిచి సుదూరంగా వెళ్లిపోయాయని ప్రచారం జరుగుతోంది. ఓటమి తరువాత జగన్ పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. వారిని ఓదార్చారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేశారు. అనంతరం సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరుకు వెళ్లి ఐదు రోజుల పాటు ఉండి పోయారు. అటు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన ఆయన మళ్లీ పార్టీ శ్రేణులతో సమావేశం అవుతూ వచ్చారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించే క్రమంలో జగన్ తీవ్రస్థాయిలో అధికార పక్షాన్ని హెచ్చరించడం విశేషం.

రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదని జగన్ హెచ్చరించారు. ఈరోజు మీది.. రేపు మాది అన్న రీతిలో మాట్లాడారు. ఈరోజు మా పార్టీ శ్రేణులపై కక్ష సాధిస్తే.. రేపు మీ పార్టీ శ్రేణులపై అదే రీతిలో చర్యలు ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ఇది విన్నపం.. కాదని హెచ్చరిక అని నేరుగా చంద్రబాబునే హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నైరాశ్యంలో ఉన్న వైసీపీ శ్రేణులకు జగన్ కామెంట్స్ కొత్త ధైర్యాన్ని ఇవ్వడం విశేషం. ప్రస్తుతం అవే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version