Amaravati Capital: అమరావతి రాజధాని నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా పక్కా వ్యూహంతో,ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది చంద్రబాబు సర్కార్. తాజాగా కేంద్ర ప్రభుత్వ భరోసాతో నిధుల సమీకరణకు సంబంధించి కష్టాలు కూడా తీరని ఉన్నాయి. కేంద్ర బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు అమరావతికి కేంద్రం గ్యారెంటీతో ప్రపంచ బ్యాంకు రుణం మంజూరుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు కేంద్రానికి సమాచారం ఇచ్చాయి. 2014లో అధికారంలోకి వచ్చింది టిడిపి ప్రభుత్వం. అందరి సమ్మతితో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. నిర్మాణ పనులు సైతం ప్రారంభించింది. దాదాపు పదివేల కోట్ల రూపాయలతో నిర్మాణ పనులను మొదలుపెట్టింది. అయితే 2019లో అధికార మార్పిడి జరగడం అమరావతికి శాపంగా మారింది. వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణ పనులను నిలిపివేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అయితే ఐదేళ్ల వైసిపి పాలనలో మూడు రాజధానుల ఏర్పాటు కాలేదు.అమరావతి నిర్మాణాలు జరగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి ఊపిరి పోసుకుంది.కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి కలిసి వచ్చింది. కేంద్ర బడ్జెట్ లో అమరావతికి నిధులు గ్యారెంటీగా ఇస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.ఆ ప్రకటన మేరకు ప్రపంచ బ్యాంకు నిధులను ఇప్పించగలరు. గ్యారెంటీగా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో రుణం మంజూరు అంశం కొలిక్కి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం లోపు 15 వేల కోట్ల రూపాయలు సాయం అందించేందుకు నిర్ణయించింది ప్రపంచ బ్యాంక్. నవంబర్ నాటికి తొలి విడతగా 3500 కోట్లను అందించనున్నట్లు తెలిపింది. సరిగ్గా అమరావతిని యధాస్థితికి తీసుకొచ్చి.. నిర్మాణ పనులు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సరిగ్గా అదే సమయానికి నిధులు అందరు ఉండడంతో పనులు శరవేగంగా జరిగే అవకాశం ఉంది.
* మాస్టర్ ప్లాన్ అమలు
అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధి, రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన లేఅవుట్లను అభివృద్ధి చేయడం,శాసనసభ, హై కోర్ట్,సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలతో పాటు నవ నగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే దాదాపు 50 వేల కోట్ల రూపాయలు దీనికి అవసరం. ఇప్పటికే దీనిపై సీఆర్డీఏ అంచనాలు రూపొందించింది.పాత బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది. అయితే నిధుల సమీకరణలో ఉండగా కేంద్రం ఈ నిధులను సర్దుబాటు చేయడంతో అమరావతి నిర్మాణ పనులు ఊపందుకొనున్నాయి. ఎప్పటికీ కొన్ని నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
* రుణ విడుదల ప్రక్రియ ప్రారంభం
తాజాగా ప్రపంచ బ్యాంకు నుంచి మంజూరైన రుణం విడుదల కోసం కావాల్సిన ప్రక్రియను ప్రారంభించారు. ప్రపంచ బ్యాంకు బృందం నాలుగుసార్లు అమరావతిని సందర్శించింది.ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంక్, సి ఆర్ డి ఏ అధికారులతో గురువారం కీలక సమావేశం జరుగుతుంది. నవంబర్ 8న తుది సమావేశం జరగనుంది. నవంబర్ 15 నాటికి ఒప్పందాలు పూర్తవుతాయి. ఈ ప్రక్రియ పూర్తయితే 15 వేల కోట్లు మంజూరైనట్టేనని అధికారులు చెబుతున్నారు. రుణ మంజూరు పై ఒప్పందం కుదిరిన వెంటనే మొత్తం రుణంలో 25% అంటే.. 3750 కోట్లు అడ్వాన్స్ రూపంలో అందుకోవచ్చు. డిసెంబర్ నాటికి ఈ నిధులు అందుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయానికి అమరావతి నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ఇదివరకే లక్ష్యంగా పెట్టుకున్నారు.
* రుణమేనని స్పష్టత
అయితే ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన ఈ 15 వేల కోట్లు గ్రాంటా? రుణమా? అన్నది చర్చకు దారి తీసింది. అయితే ఇది రుణమేనని.. కానీ 90 శాతం కేంద్రమే భరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు రుణం పై 15 నెలల పాటు మారటోరియం ఉంటుంది. ఎందుకు చెల్లించే వడ్డీ కూడా 4% లోపే ఉంటుంది. ఆ రుణంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం పది శాతం చొప్పున భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పది శాతం నిధుల్లో.. అంటే 1500 కోట్లను కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని ఆర్థిక శాఖచెబుతోంది. మొత్తానికి అయితే సరిగ్గా అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే సమయానికి.. ప్రపంచ బ్యాంకు నిధులు అందుతుండడం శుభపరిణామం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More