Women’s poker den Visakhapatnam: కాలం మారిపోయింది. ఎన్నో రకాల రుగ్మతలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా మానవ తప్పిదాలు పెరుగుతున్నాయి. జూదమాటలతో పాటు వ్యసనాల బారిన ఎక్కువ మంది పడుతున్నారు. అయితే ఇప్పుడు మహిళలు కూడా వ్యసనాల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్నంలో( Visakhapatnam) జూదం ఆడుతూ ఆరుగురు మహిళలు పోలీసులకు పట్టుబడటం విశేషం. ఇప్పటివరకు పురుషులే జూద మాటలు ఆడడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు మహిళలు సైతం అనుసరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
గుట్టు చప్పుడు కాకుండా..
విశాఖపట్నం లలితా నగర్ ( Lalita Nagar ) ప్రాంతంలో ఓ ఇంట్లో మహిళలు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నాలుగో పట్టణం పోలీసులు రంగంలోకి దిగారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 22వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అయితే ఈ మహిళలు తరచూ వారి ఇళ్లలో పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు రంగంలోకి దిగి అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also: కొత్త జిల్లాలపై కీలక ప్రకటన చేసిన సీఎం
అనేక ఫిర్యాదులు..
అయితే ఈ ఆరుగురు మహిళల్లో ఓ మహిళ భర్త గతంలోనే పోలీసులకు( police) ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎటువంటి చర్యలు లేకపోవడంతో నేరుగా పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయగా.. వారు యాక్షన్ లోకి దిగినట్లు సమాచారం. లలితా నగర్ ప్రాంతంలో ఒక భవనంలో మినీ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ నిత్యం మహిళలు కనిపిస్తుంటారు. గతంలో ఓసారి మహిళలు పేకాడుతూ పట్టుపడగా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి విడిచి పెట్టారట. ఇప్పుడు నేరుగా కుటుంబ సభ్యుడే ఫిర్యాదు చేయడంతో.. నేరుగా పోలీసులు రంగంలోకి దిగారు. మహిళలను అరెస్టు చేశారు. అయితే పేకాట ఆడుతూ మహిళలు పట్టుబడడం విశాఖలో మాత్రం సంచలనంగా మారింది.