Pawan Kalyan And BJP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) విషయంలో జరిగే రాజకీయ ప్రచారం అంతా ఇంతా కాదు. ఆయన మౌనంగా ఉన్నా ప్రచారమే. దూకుడుగా ఉన్న అదే తరహా ప్రచారం. అయితే ఇప్పుడు కొత్త ప్రచారం ఏమిటంటే ఆయన ఢిల్లీ టూర్లకు ఎందుకు వెళ్లడం లేదని. బిజెపి పెద్దలకు ఎందుకు గ్యాప్ పాటిస్తున్నారని.. ఆయనతో పోల్చుకుంటే తరచూ లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారు కదా అని విశ్లేషణలు చేస్తున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే పవన్ ఏపీలో ఉన్న ఢిల్లీ పెద్దలు లైన్ లోకి రావాల్సిందే. అలా వస్తున్నారు కూడా. ఏపీలో కూటమి నిలబడాలని పవన్ భావిస్తున్నారు. అందుకు ఆయన తప్పకుండా బిజెపి వైపు చూస్తారు. కానీ బిజెపికి పవన్ కళ్యాణ్ తో అంతకుమించి భవిష్యత్తు అవసరం ఉంది.
* ఆదుకుంది దక్షిణాది రాష్ట్రాలే..
ఉత్తరాది రాష్ట్రాల్లో( North States) గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి అనుకున్న స్థానాలు దక్కలేదు. అటువంటి సమయంలో ఆదుకుంది దక్షిణాది రాష్ట్రాలే. ముఖ్యంగా ఏపీ నుంచి దక్కిన 21 అసెంబ్లీ స్థానాలు ఎన్డీఏ కు బలాన్ని ఇచ్చాయి. తెలంగాణలో సైతం ఎనిమిది పార్లమెంట్ స్థానాలు బిజెపికి దక్కాయి. వచ్చే ఎన్నికల నాటికి వీటిని నిలబెట్టుకోవడమే కాదు కొత్తగా మరికొన్ని తెచ్చుకోవాలన్నది బిజెపి ప్రణాళిక. అయితే ఇలాంటి ప్రయత్నాలకు పవన్ కళ్యాణ్ అయితే సరిపోతారని బిజెపి ఇదివరకే నిర్ణయం తీసుకుంది. అందుకే ఆయనతో సనాతన ధర్మ పరిరక్షణ అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చింది. పవన్ కళ్యాణ్ అవసరం ఇప్పుడు బిజెపికి చాలా ఎక్కువగా ఉంది. దానిని వదులుకునేందుకు ఎంత మాత్రం ఆ పార్టీ సిద్ధంగా లేదు.
* ఎంతో చనువు ఉన్నా..
పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల తర్వాత బిజెపితో( Bhartiya Janata Party) పొత్తు ప్రకటన చేశారు. భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తామని ప్రకటించారు. బిజెపి పెద్దలు సైతం పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ను గుర్తించారు. అయితే బిజెపి పెద్దల చనువును పవన్ కళ్యాణ్ ఎన్నడూ దుర్వినియోగం చేయలేదు. తనకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా చర్చించారు కదా అని.. తరచూ వారితో కలిసే ప్రయత్నం చేయలేదు. చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆహ్వానించిన ఢిల్లీ వెళ్ళిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చిన తరువాత సైతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ ప్రత్యేకంగా వెళ్లిన సందర్భాలు లేవు. ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భాలు అంతకంటే లేవు. అయితే ఢిల్లీ పెద్దల నుంచి ఏపీలోని పవన్ కార్యాలయానికి హాట్ లైన్ మాత్రం నడుస్తోంది. ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాలతో పవన్… పవన్ సూచనలతో ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు చర్చలు మాత్రం జరుపుకుంటున్నారు. ఇది తెలియని విశ్లేషక లోకం అనేక రకాలుగా చర్చించుకుంటుంది. అంతకుమించి ఏమీ కనిపించదు కూడా.
* తెలుగు రాష్ట్రాల్లో అవసరం..
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. విపరీతమైన సినీ గ్లామర్ ఉన్న పవన్ కళ్యాణ్ అవసరం బిజెపికి కీలకం. మరోవైపు ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గం ఆయన వెన్నంటి ఉంది. ఏపీలో ఓట్లతో పాటు సీట్లు పెంచుకోవాలని బిజెపి భావిస్తోంది. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడిచిపెడుతుంది బిజెపి. కానీ ఈ విషయాన్ని గమనించని వ్యతిరేకులు అదేపనిగా ప్రచారం చేస్తున్నారు.