Bigg Boss 9 Telugu grand finale: బుల్లితెర ప్రేక్షకుల్లో ఎప్పటి గత రెండు మూడు వారాల నుండి నెలకొన్న ఉత్కంఠ కు తెర రేపు పడనుంది. రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోయిన ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) టైటిల్ విన్నర్ గా ఎవరు నిలబడబోతున్నారు అనేది రేపటితో తేలనుంది. కాసేపటి క్రితమే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన షూటింగ్ మొదలైంది. నేడు సాయంత్రం 6 గంటల లోపు టాప్ 5 లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. కేవలం టాప్ 2 మాత్రమే హౌస్ లో ఉంటారు. వీళ్ళని స్టేజి మీదకు తీసుకొచ్చే ఎపిసోడ్ రేపు సాయంత్రం షూట్ చేస్తారు. ఇక విన్నర్ ని ప్రకటించే షాట్ మాత్రం టెలికాస్ట్ సమయం లోనే లైవ్ లో చూపిస్తారు. అంటే విన్నర్ ఎవరు అనే విషయం మనం టీవీ టెలికాస్ట్ లో మాత్రమే చూసి తెలుసుకోవాలి అన్నమాట. అలా ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీం.
ఈ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథి గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి 12 గంటలకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి ఎవరెవరు ఏ స్థానం లో ఉన్నారు అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. తనూజ, పవన్ కళ్యాణ్ లలో ఎవరు టాప్ లో ఉన్నారు అనేది చెప్పడం చాలా కష్టం అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూడా ఎవరు గెలవబోతున్నారు అనే విషయం పై స్పష్టమైన క్లారిటీ లేదు. కొంతమంది తనూజ అంటున్నారు, మరికొంతమంది పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ రెండు స్థానాల గురించి పక్కన పెడితే మిగిలిన మూడు స్థానాల గురించి మాత్రం స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఈ వారం మొత్తం డిమోన్ పవన్ ఇమ్మానుయేల్ ని ఓటింగ్ లో డామినేట్ చేస్తూ వచ్చాడు.
దీంతో కచ్చితంగా డిమోన్ పవన్ మూడవ స్థానం లో, ఇమ్మానుయేల్ నాల్గవ స్థానం లో నిలుస్తారని అంతా అనుకున్నారు. కానీ నిన్న ఓటింగ్ ముగిసేసమయానికి ఇమ్మానుయేల్ డిమోన్ ని దాటి మూడవ స్థానం లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య తేడా కేవలం 1 శాతం మాత్రమే ఉందట. అలా నాల్గవ స్థానం లోకి డిమోన్ పవన్ రాగా, 5 వ స్థానం లో సంజన నిల్చింది. కాసేపట్లో ఈమె ఎలిమినేషన్ జరగనుంది. ఇదైతే పక్కా సమాచారం, మొదటి రెండు స్థానాల్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ట్రోఫీ ఎవరు అందుకోబోతున్నారు అనేది తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.