Minister Roja: రోజాకు షాక్.. టిక్కెట్ లేనట్టే.. ప్రచారానికి పరిమితం చేయనున్న జగన్

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చేందుకు వైసిపి హైకమాండ్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పార్టీ ప్రెస్ నోట్లో 11 మంది అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : December 15, 2023 3:08 pm

Minister Roja

Follow us on

Minister Roja: మంత్రి రోజాకు జగన్ ఝలక్ ఇవ్వనున్నారా? ఈసారి టిక్కెట్ విషయంలో మొండి చేయి చూపునున్నారా? నగిరి నియోజకవర్గంలో పక్కన పెట్టనున్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసిపి ఆవిర్భావం తర్వాత రోజా జగన్ వెంట నడిచారు. అధినేత పై ఈగ వాలనివ్వకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం తన హావభావాలతో అధికారపక్షంపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఆమె మూల్యం కూడా చెల్లించుకున్నారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుమించి టిడిపి పై రివెంజ్ తీర్చుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చేందుకు వైసిపి హైకమాండ్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పార్టీ ప్రెస్ నోట్లో 11 మంది అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సంఖ్య పెరగవచ్చు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా 82 మంది అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతోంది. అందులో ఓ పదిమంది మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో తొలి పేరు రోజాది కావడం మరి విశేషం. గత కొద్ది రోజులుగా నగిరి నియోజకవర్గంలో రోజాకు సమాంతరంగా ఒక వర్గం అభివృద్ధి చెందుతోంది. వారికి పార్టీ హై కమాండ్ అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి అనుచరులకు అక్కడ పెద్దపీట వేస్తున్నారు. వారితో మంత్రి రోజాకు పొసగడం లేదు. దీంతో అక్కడ రోజాను మార్చుతారని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మార్పుల్లో నగిరి కూడా ఉందని తెలుస్తుండటంతో రోజా ఆందోళన చెందుతున్నారు.

నగిరిలో రోజాకు టిక్కెట్ ఇస్తే సొంత పార్టీ నేతలే పనిగొట్టుకొని ఓడిస్తారన్న ప్రచారం ఉంది. దీనిపై సీఎం జగన్ కు సైతం నివేదికలు అందినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి రోజాను పక్కన పెట్టి.. పార్టీ ప్రచార కార్యక్రమానికి వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీకి స్టార్ క్యాంపైనర్లు లేరు. అందుకే రోజాను ఆ టీమ్ లోకి తీసుకొని.. నగిరి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తీసుకురావాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు రోజా ఒప్పుకుంటారో లేదో చూడాలి.

అయితే రోజాను జగన్ వద్దనడానికి కారణం ఇంకొకటి ఉంది. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి ప్రభావం ఎక్కువ. ఆయన నగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. గత ఎన్నికల్లో రోజా స్వల్ప మెజారిటీతోనే గట్టిక్కారు. ఈసారి మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న దృష్ట్యా.. బలమైన అభ్యర్థిని బరిలో దించుకుంటే నగిరి స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుందని పెద్దిరెడ్డి సీఎం జగన్ కు హెచ్చరించినట్లు సమాచారం . దీంతో జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు. పెద్దిరెడ్డి అభిప్రాయంతో ఏకీభవించారు. పెద్దిరెడ్డి సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని దాదాపు డిసైడ్ అయ్యారు.రోజాకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార బాధ్యతలు అప్పగించడానికి నిర్ణయించారు. అయితే ఇప్పటికే దీనిపై రోజాకు సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఈ నిర్ణయానికి ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి.