Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం ఎందుకు చేయలేదు?

Pawan Kalyan: పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం ఎందుకు చేయలేదు?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మంత్రి గానే ప్రమాణం ఎందుకు చేశారు? డిప్యూటీ సీఎం గా చేయలేదు ఎందుకు? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఈనెల 12న సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే డిప్యూటీ సీఎం గా పవన్ పేరు ఖరారు అయింది. కానీ కేవలం పవన్ మంత్రి గానే ప్రమాణస్వీకారం చేశారు. నిన్న సీఎం చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, తాగునీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖలను కేటాయించారు. ఈ శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా అప్పగించారు. అయితే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పవన్ డిప్యూటీ సీఎం గా ఎందుకు చేయలేదన్నది ఇప్పుడు ప్రశ్న.

భారత రాజ్యాంగంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరు నడపాలి అన్నది స్పష్టంగా రాశారు. అందులో రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేంద్రంలో ప్రధానమంత్రి ప్రభుత్వాలు నడపాలని పేర్కొన్నారు. వీరికి మంత్రిమండలి సహకరిస్తుంది. ఇంగ్లీషులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. రాజ్యాంగంలో ప్రధాని, ముఖ్యమంత్రి వారి కింద ఉండే మంత్రుల ప్రస్తావన ఉందే తప్ప.. ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాన మంత్రి అనే పదాలు ఎక్కడా కనిపించవు. అంటే వీటికి రాజ్యాంగబద్ధత లేదు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం పదవులు రాజ్యాంగపరమైనవి కావు. కేవలం అవి రాజకీయపరమైనవి.రాజకీయంగా ప్రధాని, ముఖ్యమంత్రి తరువాత ఆ స్థాయి కల్పించేందుకు సృష్టించినవే ఈ పదవులు. సీఎం సమాన స్థాయిలో ఉండే నేతలకు ప్రత్యామ్నాయ గౌరవ స్థాయిని కల్పించేందుకు డిప్యూటీ సీఎం అనే హోదా ఇస్తారు. ఇది కేవలం రాజకీయ అనివార్యత పై ఆధారపడి ఉంటుంది.

ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కీలకం. చంద్రబాబుతో సమాన స్థాయి అందించేందుకే డిప్యూటీ సీఎం పదవి కేటాయించారు. ఒకానొక దశలో సీఎం పోస్టులో చెరి సగం ఇవ్వాలన్న డిమాండ్ బయట నుంచి వచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హై కమాండ్ పట్టు నిలుపుకునేందుకు డిప్యూటీ సీఎం పోస్ట్ కు ప్రాధాన్యమిచ్చే వారు. కానీ టిడిపి ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ డిప్యూటీ సీఎం పోస్టును కేటాయించలేదు. చంద్రబాబు సైతం అదే పరంపరను కొనసాగించారు. తరువాత రాజశేఖర్ రెడ్డి సైతం కేటాయించలేదు. కానీ 2014 తర్వాత డిప్యూటీ సీఎంల హవా ప్రారంభం అయ్యింది. చంద్రబాబు ఇద్దరికీ డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఏకంగా ఐదుగురికి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక గౌరవం ఇవ్వాలన్న భావనతో ఒకే ఒక డిప్యూటీ సీఎం పోస్టును ఆయనకు కట్టబెట్టారు. కేవలం రాజకీయ గౌరవం కోసమే ఈ పదవిని సృష్టించారు. దీనికి ఎటువంటి రాజ్యాంగబద్ధత లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular