AP Incarnation Day: తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. తెలుగు మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంగా ఉండాలని భావించి ఏపీ ని ఏర్పాటు చేశారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం కూడా ఏపీనే.కానీ అటువంటి ఏపీ అవతరణ దినోత్సవం జరుపుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలన్న ప్రధానమైన డిమాండ్ తో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలుగు మాట్లాడే పదకొండు జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 1956 నవంబర్ 1న నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. దీంతో ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్ గా మారింది. ఆ విధంగా కొత్త రాష్ట్రం అవతరించింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా గుర్తింపు సాధించింది. నాటి నుంచి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం గా జరుపుకుంటూ వస్తున్నాం. కానీ 2014లో రాష్ట్ర విభజన జరిగింది.తెలంగాణ విడిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగింది. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. ఇప్పటికీ అదే మాదిరిగా ఉంది. నిన్న నవంబర్ 1 అయినా.
.రాష్ట్రంలో ఎక్కడా అవతరణ దినోత్సవము జరగకపోవడం విశేషం.
* వైసీపీ సర్కార్ ఏకపక్ష నిర్ణయం
అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. అయితే దానిపై అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. ఆ నిర్ణయం సముచితం కాదని తెలుస్తోంది. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విలీనం అయినది నవంబర్ 1న. దీంతో ఆంధ్ర ప్రదేశ్ గా మారడంతో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అదే రోజున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఆంధ్ర రాష్ట్రం మాదిరిగానే భౌగోళికంగా నవ్యాంధ్రప్రదేశ్ మిగిలింది. రాష్ట్రం యధా స్థానంలోకి రావడంతో.. పొట్టి శ్రీరాములు అమరత్వంతో ఏర్పడిన అక్టోబర్ 1న అవతరణ దినోత్సవం జరుపుకోవడం సముచితం అని నిపుణులు సూచించారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అవతరణ దినోత్సవం జరుపుకోకపోవడానికి అదే ప్రధాన కారణమని తెలుస్తోంది. కానీ జగన్ సర్కార్ కనీస ఆలోచన చేయకుండా నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని కొనసాగించడం కూడా విమర్శలకు తావిచ్చింది.
* అక్టోబర్ 1 ఉత్తమం
వాస్తవానికి 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. అదే రోజు నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవాలన్న సూచన కూడా వచ్చింది. అయితే అప్పటివరకు సోదర భావంతో మెలిగిన తెలంగాణ ఏపీ నుంచి విడిపోయింది అదే రోజు. ఒకరకంగా చెప్పాలంటే విభజన అనేది ఏపీకి ఇష్టం లేదు. విభజనతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న వాదన ఉంది. అటువంటి విభజన తేదీనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం సముచితం కాదని నిపుణులు సూచించారు. దీంతో నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. జూన్ 2న జరుపుకోవాలని ఇష్టపడలేదు. నవ్యాంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర భౌగోళిక స్థితికి రావడం, తెలంగాణ విడిపోవడంతో నవంబర్ 1 సైతం జరుపుకోవడానికి ముందుకు రాలేదు. పొట్టి శ్రీరాములు అమరత్వంతో అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడంతో..అదేరోజు అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆకాంక్షప్రజల నుంచి బలంగా వచ్చింది. అయితే ఇది భావోద్వేగాలతో కూడిన అంశం కావడంతో చంద్రబాబు సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనినే రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని వైసిపి భావిస్తోంది. అప్పట్లో కనీస ఆలోచన చేయకుండా నవంబర్ 1 ని అవతరణ దినోత్సవంగా కొనసాగించారు జగన్. అదే తేదీని ఇప్పుడు కూడా కొనసాగించాలని వైసిపి కోరుతోంది. కానీ కూటమి సర్కార్ మాత్రం నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని.. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని.. వచ్చే ఏడాది నాటికి ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Why did ap get to the point of not being able to celebrate incarnation day whose fault is this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com